Abn logo
Dec 3 2020 @ 10:24AM

చాలా మంది నన్ను ద్వేషిస్తున్నారు: ఆలియా

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కారణంగా బాలీవుడ్‌లోని బంధుప్రీతి గురించి బాగా చర్చ జరిగింది. స్టార్ వారసులను తప్ప బయటివారిని బాలీవుడ్‌లో ఎదగనివ్వడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ కథానాయిక ఆలియా భట్ ఈ విమర్శకులకు ప్రధాన టార్గెట్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆలియాపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.


తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి తాజాగా ఆలియా స్పందించింది. `నేను చాలా విద్వేషాన్ని ఎదుర్కొన్నా. ఎంతో మంది నెటిజన్లు నన్ను ద్వేషిస్తున్నారు. నన్ను తిడుతూ చాలా పోస్టులు వస్తుంటాయి. అయితే అవే నాకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఎదుటి వ్యక్తితో దయతో వ్యవహరించాలని నాకు ఇటీవల బాగా అర్థమైంది. ఎదుటి మనుషులతోనే కాదు మనం నివసిస్తున్న ఈ భూమి పట్ల కూడా ప్రేమగా ఉండాల`ని ఆలియా పేర్కొంది. 

Advertisement
Advertisement
Advertisement