Abn logo
Jul 13 2020 @ 23:54PM

తనని బెదిరిస్తూ వచ్చిన పిక్స్‌ని షేర్ చేసిన అలియా భట్ సోదరి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌లో ‘బంధుప్రీతి’పై చర్చలు మొదలయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. సుశాంత్ ఫ్యాన్స్ నెపోటిజంపై భగ్గుమన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోవడానికి కారణం నెపోటిజం అని చూపిస్తూ.. కొందరిని డైరెక్ట్‌గా పేర్లతో వాడకూడని విధంగా, రాయకూడని విధంగా దూషించారు. అందులో అలియా భట్ ఆమె ఫ్యామిలీ కూడా ఉంది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి తర్వాత తనకి, తన ఫ్యామిలీకి ఎటువంటి బెదిరింపులు వచ్చాయో చెబుతూ అలియా భట్ సోదరి షహీన్ భట్ కొన్ని పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


‘మీ ఐడెంటిటీని నేను దాచను. అందరికీ తెలిసేలా చేస్తాను. అలాగే లీగల్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాను..’’ అని తమని బెదిరిస్తున్న, వేధిస్తున్న వారికి షహీన్ తెలిపింది. అలాగే సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రమ్‌ విధివిధానాలపై కూడా ఆమె మండిపడుతూ తన పోస్ట్‌లో పేర్కొంది.

Advertisement
Advertisement
Advertisement