Abn logo
Apr 10 2020 @ 07:47AM

‘ఆర్ఆర్ఆర్’ కోసం భారీ రెమ్యున‌రేష‌న్‌..?

రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘రౌద్రం రుణం రుధిరం’(ఆర్ఆర్ఆర్‌). ఇందులో ఆలియా భ‌ట్ కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించ‌నున్న ఆలియా కోసం నిర్మాత‌లు భారీ రెమ్యున‌రేష‌న్‌నే ఇస్తున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మే నెల‌లో ప్రారంభం కాబోయే త‌దుప‌రి ఆర్ఆర్ఆర్ షెడ్యూల్ కోసం ఆలియా ప‌ది రోజుల కాల్షీట్‌ను కేటాయించిందట‌. ఈ ప‌ది రోజుల‌కు రూ.5కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుంద‌ని టాక్‌. అంటే రోజుకు యాబై ల‌క్ష‌ల రూపాయ‌ల పారితోష‌కాన్ని తీసుకున్న‌ట్లే. ఇంత భారీ రెమ్యున‌రేష‌న్ అవ‌స‌ర‌మా? అనే గుస‌గుస‌లు స్టార్ట్ అయ్యాయి. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 8న విడుద‌ల చేయాల‌ని ద‌ర్శక నిర్మాత‌లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement