Abn logo
Sep 26 2021 @ 08:58AM

భార్య రోజూ అలా చేయడం లేదని విడాకులు కోరిన భర్త.. అదేంటో తెలుసుకుని షాకైన అధికారులు

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంగరంగా వైభవంగా పెళ్లి చేసుకున్న ఓ వ్యక్తి.. అకస్మాత్తుగా విడాకులు కావాలంటూ పట్టుపట్టిన ఘటన స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భర్త విడాకులు కోరడంతో ఆందోళనకు గురైన ఆ మహిళ.. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆ మహిళ నుంచి భర్త ఎందుకు విడాకులు కోరుతున్నాడో తెలుసుకుని.. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు షాక్ అయ్యారు. ఇంత సిల్లీ రీజన్‌ చూపించి.. విడాకులు కోరుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఉత్తర ప్రదేశ్‌లోని అలీగర్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం వ్యక్తికి రెండేళ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. ఈ క్రమంలో ఆ దంపతులు ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య చిన్నగా మనస్పర్థలు మొదలయ్యాయి. దీనికి కారణం అతడి భార్య రోజూ స్నానం చేయకపోవడమే. రోజూ స్నానం చేయాలంటూ సదరు వ్యక్తికి తన భార్యకు పలుమార్లు సూచించాడు. అయితే ఆయన మాటలను ఆమె అంతగా పట్టించుకోలేదు. దీంతో ఓ రోజు విసుగు చెందిన ఆ వ్యక్తి.. తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు మూడు సార్లు తలాక్ చెప్పాడు. ఈ ఘటనతో కంగుతిన్న ఆ భార్య ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌ను ఆశ్రయించారు. 


రోజూ స్నానం చేయడం లేదనే కారణం చూపుతూ తన భర్త తనకు విడాకులు ఇస్తానంటున్నాడని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ దంపతుల సమస్యను విని.. తొలుత ఆశ్చర్యపోయిన అధికారులు.. సదరు భర్తను పిలిచి వివరణ కోరారు. దీంతో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కార్యాలయానికి చేరుకున్న భర్త.. విడాకులు ఇప్పించాలని అధికారులను కోరారు. ఈ క్రమంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు.. భార్యభర్తలను ఇద్దరినీ కార్యాలయానికి పిలిపించి.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో విడిపోకూడదంటూ సర్దిచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ అంశం ప్రస్తుతం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. 



ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...