అన్ని వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2020-04-05T10:06:02+05:30 IST

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె

అన్ని వసతులు కల్పించాలి

(ఆంధ్రజ్యోతి -నెట్‌వర్క్‌)

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌ అన్నారు. సూర్యాపేట మునిసిపాలిటీ పరిధిలోని గాంధీనగర్‌, పిల్లలమర్రి, దాసాయిగూడెంలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చా రు. శనివారం ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమ య్యాయి. చివ్వెంల మండలంలోని ఖాసీంపేటలో కౌన్సిలర్‌ జాఠోతు లక్ష్మీమకట్‌లాల్‌  ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, వేములపల్లి మండలాల్లోని ఆర్జాలబావి, శెట్టిపాలెం పరిధిలోని వసంత రైస్‌మిల్లులో ఏర్పాటు చేసిన ఐకేపీ కేంద్రాలను నల్లగొండ ఎస్పీ ఏవీ. రంగనాథ్‌ పరిశీలించారు. రైతులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ధాన్యం సేకరణ సజావుగా జరిగేలా చూడాలన్నారు.


కట్టంగూరు మండలంలోని అయిటిపాములలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించారు. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ పుట్టల సునీత, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ ప్రారంభించారు. మాడ్గులపల్లి మండలం మాచనపల్లి, ధర్మాపురం గ్రామాల్లో పీఏసీఎస్‌ నిడమనూరు, కన్నెకల్‌ ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు.


నిడమనూరు మండలంలోని వెనిగండ్లలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రారంభించారు. మాడ్గులపల్లి మండలంలోని వేములపల్లి పీఏసీఎస్‌ ఛైర్మన్‌ జెర్రిపోతుల రాములుగౌడ్‌ ప్రారంభించారు. నడిగూడెం మం డలంలోని పలు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఎంపీపీ యాతాకుల జ్యోతీమధుబాబు ప్రారంభించారు. కోదాడ మండలంలోని తొగర్రాయి సహకార సంఘంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ చింతా కవితారెడ్డి, జడ్పీటీసీ మందలపు కృష్ణకుమారి ప్రారంభించారు.


చిలుకూరు మండలంలోని పాలెన్నారంలో డీసీసీబీ డైరెక్టర్‌ కొండా సైదయ్య ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించారు. హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డలో ఎంపీపీ గూడెపు శ్రీను, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, సొసైటీ డైరెక్టర్‌ దొంగరి వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. నేరేడుచర్లలో డీసీసీబీ డైరక్టర్‌ దొండపాటి అప్పిరెడ్డి, మండలంలో జడ్పీటీసీ బానోతుజగన్‌నాయక్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

Updated Date - 2020-04-05T10:06:02+05:30 IST