Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్నీ కోల్పోయాం.. కనీసం వరద సమాచారం లేదు

ఎమ్మెల్యే ప్రసన్న ముందు పల్లిపాళెం ప్రజల ఆవేదన

బుచ్చిరెడ్డిపాళెం,నవంబరు 28: ‘అన్నీ కోల్పోయాం.. కనీసం పెన్నానదికి వరద వస్తుందనే సమాచారం కూడా లేదు.. కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డాం’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఎదుట దామరమడుగు పల్లిపాళెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పల్లిపాళెంతోపాటు పాతరస్తా(కాలువకట్ట) గిరిజన కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. అందరినీ  అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ సాయం, సరుకులు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వరదలతో ఇళ్లు కూలిన వారికి మళ్లీ ప్రభుత్వంచే ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు. పల్లిపాళెంలో ఓ కమ్యూనిటీ హాలుకు నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఆయన వెంట వైసీపీ నాయకులు అహ్మద్‌ బాషా, భాస్కర్‌రెడ్డి, లక్ష్మయ్య తదితరులున్నారు.

Advertisement
Advertisement