ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-22T05:07:44+05:30 IST

ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షల నిర్వహణ కోసం

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఈవో తిరుపతిరావు

  • డీఈవో తిరుపతిరావు

( ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు తెలిపారు. ఈనెల 25 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్‌ మొదటి సంవత్సర పరీక్షలను నిర్వహణపై గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వివిధ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. పరీక్షల కోసం పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు మాట్లాడుతూ.. జిల్లాలో 195 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామని, పరీక్షలకు 56,241 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఇందులో బాలికలు 28,832 కాగా, బాలురు 27,409 మంది హాజరవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పసుల్తానీయా, కమి షనర్‌ సయ్యద్‌జలీల్‌, జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారి వెంకయ్యనాయక్‌, సుసిందర్‌కుమార్‌తోపాటు వైద్య, విద్య, పోలీసుశాఖలకు చెందిన అధికా రులు పాల్గొన్నారు. 




Updated Date - 2021-10-22T05:07:44+05:30 IST