Advertisement
Advertisement
Abn logo
Advertisement

అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి

 - ధాన్యం సేకరణలో ఇబ్బందులు  ఉండకూడదు  : కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా

వనపర్తిరూరల్‌/కొత్తకోట, నవంబరు 30:  ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులకు సూచించారు. జిల్లాలోని రాజాపేట, ఈదులబాయి తండా, కానాయపల్లి గ్రామ పంచా యతీలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రా లను మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని ఐకేపీ కేంద్రాలలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తు న్నారా?  ఎక్కడైనా సమస్యలున్నాయా? అని ఆమె అడిగి తెలుసుకున్నారు. ఐకేపీ ద్వారా 228 కేంద్రాల ను ఏర్పాటు చేశామని 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యాన్ని సేకరిస్తామన్నారు. వర్షం వచ్చే అవకాశం ఉ న్నందున అన్ని కొనుగోలు కేంద్రాలలో టార్ఫాలీన్‌ కవర్లు పూర్తిస్థాయిలో అందు బాటులో ఉంచాలన్నా రు. కొత్తకోట పట్టణ ప్రకృతి వనం, పురపాలక సం ఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని ఆమె పరి శీలించారు.  కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ వామన్‌ గౌడ్‌, సివిల్‌ సప్లయ్‌ జిల్లా అధికారి అనిల్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వంశీధర్‌రెడ్డి, మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటే శ్వర్‌, అడిషనల్‌ డీఆర్‌డీవో కృష్ణయ్య, ప్రశాంత్‌, రాజా పేట మండల వ్యవసాయ అధికారి కురుమయ్య, షేక్‌ మున్న, నంద కిషోర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌, సర్పంచ్‌ మాధవ రెడి ్డ, కౌన్సిలర్లు , రైతులు తదితరులు పాల్గొన్నారు. 

యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవాలి  

వనపర్తి అర్బన్‌, నవంబరు 30: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసేందుకు రైతులకు అవగాహన కల్పించాలని  కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో మంగళవారం మండల వ్యవ సాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  యాసంగిలో వరి పంటకు బదులు ఆరుతడి పంటలైన వేరు శనగ, మినుము, పెసర, ఆముదం, కుసుమలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చునని ఆమె వివరించారు. జిల్లా లో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ధాన్యం విక్రయించడానికి వచ్చే రైతులకు ఇబ్బందులు కలగకుండా, ఇతర పంటల సాగు చేసేలా వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తలు అవగాహన కల్పించాలని ఆదేశించారు.   ఏ నేలలో ఏ పంటలు వేయాలనే విషయాన్ని శాస్త్రవేత్తలతో సలహాలు తీసుకుని ఆరుతడి పంట లు సాగు చేయించాలని సూచించారు. అనంతరం  పోస్టర్‌ను విడుదల చేశారు.  కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఏడీఏ శివనాగిరెడ్డి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.  Advertisement
Advertisement