అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి

ABN , First Publish Date - 2021-04-10T05:46:04+05:30 IST

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు.

అన్ని శాఖలు సమన్వయంతో విధులు నిర్వర్తించాలి

ఆదిలాబాద్‌టౌన్‌, ఏప్రిల్‌ 9: కరోనా వ్యాప్తి అరికట్టేందుకు జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జారీ చేసిన ఆదేశాలకనుగుణంగా అన్ని స్థాయిల అధికారులు ఈ విపత్కర సమయంలో కలిసికట్టుగా పని చేయాలన్నారు. కరోనా నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని భౌతిక దూరం పాటించాలనే విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు తప్పనిసరిగా 45ఏళ్లు నిండిన వారు వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని సూచించారు. ఇందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి వ్యాక్సినేషన్‌ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. మాస్కు వినియోగించని వారికి జరిమానా విధించాలని మున్సిపల్‌, పంచాయతీ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రైతుబజార్లు, సంతలు, షాపింగ్‌మాల్‌, సూపర్‌మర్కెట్లు, వైన్స్‌షాపులు వంటి ప్రాంతాలలో రద్దీ ఉండకూడా చూడాలన్నారు. ఇందుకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల సహకారంతో ప్రజలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ముఖ్యంగా నేతాజిచౌక్‌, గాంధీ, అంబేద్కర్‌, శివాజిచౌక్‌, రైతుబజార్‌ వంటి రద్దీ ప్రదేశాల్లో మున్సిల్‌, పోలీసు ప్రజలకు చైతన్యపరిచే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శైలజ, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-10T05:46:04+05:30 IST