Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి

అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

సోన్‌, నవంబరు 27 : అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిం చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అదనపు కలెక్టర్‌ హే మంత్‌ బోర్కడే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని అంగన్‌ వాడీ కేంద్రాలను, సెకండరీ పాఠశాలను, గ్రామ పంచాయతీ కార్యా లయంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో బాధ్య తాయుతంగా వ్యవహరించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహరంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల సౌకర్యం కల్పించాలన్నారు. సిబ్బంది విధుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయ కుండా సక్రమంగా హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ వినోద్‌ కుమార్‌, ఎంపీవో అశోక్‌, సిబ్బంది ఉన్నారు. 

Advertisement
Advertisement