రైతులందరినీ భాగస్వాములను చేయాలి

ABN , First Publish Date - 2021-03-05T05:40:00+05:30 IST

రైతులందరినీ భాగస్వాములను చేయాలి

రైతులందరినీ భాగస్వాములను చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పౌసుమిబసు

  • అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ సందర్శనలో కలెక్టర్‌ పౌసుమిబసు


మోమిన్‌పేట: మోమిన్‌పేట మండల కేంద్రంలో గల అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో మండలంలోని ప్రతీ రైతును భాగస్వాములను చేయాలని కలెక్టర్‌ పౌసుమిబసు అన్నారు. మండల కేంద్రంలోని అనంతగిరి రైతు ఉత్పత్తిదారులు కంపెనీ పనితీరుపై సంబంధిత అధికారులు, సీసీలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల రైతులు అన్ని రకాల కూరగాయలు, పంటలు పండించే విధంగా వారిని ప్రోత్సహించాలని అధికారులను సూచించారు. మార్చి నెలలో రైతుల నుంచి రెండు మెట్రిక్‌ టన్నుల కూరగాయలు సేకరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో కృష్ణన్‌, నర్సిములు, శ్రీనివాస్‌, అబ్దుల్‌, లక్ష్మి, ప్రమీల, సీసీలు పాల్గొన్నారు. అంతకు ముందు మండలంలోని కేసారం గ్రామంలో పర్యటించి రోడ్డు, మురికి కాలువను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ, డీఎల్పీవో అనిత, ఎంపీవో యాదగిరి, పీఆర్‌ఏఈ ప్రణీత్‌, గ్రామకార్యదర్శి తిరుపతమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T05:40:00+05:30 IST