Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాల సేకరణకు అన్నివిధాల సిద్ధం కావాలి..

- జేసీ డాక్టర్‌ సిరి 

కదిరిఅర్బన్‌ , నవంబరు 30:  జగనన్న పాలవెల్లువ కార్యక్ర మాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ.. పాల సేకరణకు అన్ని విధా లుగా సిద్ధం కావాలని జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అధికారులను ఆదే శించారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో అమూల్‌ జగ నన్న పాలవెల్లువ కార్యక్రమంపై క్షేత్ర స్థాయి సిబ్బందికి జరు గుతున్న శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మా ట్లాడుతూ పాలవెల్లువ కార్యక్రమం సక్రమంగా అమలు చేయ డానికి ప్రణాళికతో ముందుకెళ్ళాలన్నారు. పరికరాలు ఎలా ఆపరేట్‌ చేయాలి.. పాలు ఎలా సేకరించాలి తదితర అంశాల పై అమూల్‌ సంస్థ తరఫున వచ్చిన ట్రైనర్స్‌ శిక్షణ ఇస్తారన్నారు. ఈ శిక్షణ కార్య క్రమాలకు డిజిటల్‌ అసిస్టెంట్‌లు, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు, సచివాలయ సెక్రటరీలు హాజరు కావాలన్నారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా క్షేత్ర స్థాయిలో పాల వెల్లువ కార్యక్రమం అమలులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వీలు కలు గుతుందన్నారు. అనం తరం రూరల్‌ పరిధిలోని కుమ్మర వాండ్లపల్లిలో చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాన్ని, గ్రామ సచివాల యాన్ని, స్థానిక జడ్పీఉన్నత పాఠశాలను జేసీ తనిఖీ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని రాచువారిపల్లితాండాకు వెళ్ళే మార్గంలో వర్షానికి దెబ్బతిన్న కల్వర్టులను పరిశీలించారు. ఈ కార్య క్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, ఎంపీడీఓ రమేష్‌బాబు, ఈఓఆర్‌డీ వెంక టేష్‌, తహసీల్దార్‌ మారుతి, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.  అనంతరం జేసీకి పలు విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై వినతిపత్రాలు అం దజేశారు. 


Advertisement
Advertisement