కరోనా నుంచి ఉద్యోగులను కాపాడటానికి అన్ని చర్యలు

ABN , First Publish Date - 2021-06-14T06:03:29+05:30 IST

సింగరేణి ఉద్యోగులను క రోనా నుంచి కాపాడుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ అన్నారు.

కరోనా నుంచి ఉద్యోగులను కాపాడటానికి అన్ని చర్యలు
ఆర్జీ-1లో పరిశీలిస్తున్న డైరెక్టర్‌(పా, ఫైనాన్స్‌) బలరాంనాయక్‌

- మెగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రారంభించిన డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌

గోదావరిఖని, జూన్‌ 13: సింగరేణి ఉద్యోగులను క రోనా నుంచి కాపాడుకోవడం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు సింగరేణి డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం సింగరేణి ఆధ్వర్యంలో ఆర్‌జీ-1 కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన మెగావ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణకు సంస్థ ఖ ర్చుకు వెనుకాడడం లేదని, ఉద్యోగులను కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు.కరోనా సోకిన ఉద్యోగులకు హైదరాబాద్‌లో కూడా మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు చెప్పారు. కరోనా సోకిన ఉద్యోగులు మనో ధైర్యంతో ఉండాలని, సంస్థలో ఆదివారం అన్ని ఏరియాల్లో ఈ మెగా వ్యాక్సిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు, వ్యాక్సిన్‌పై ఉద్యోగులకు అవగాహన కల్పించినట్టు చెప్పారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మూడు రోజుల్లో వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే ఉద్యోగుల కోసం అన్నీ ఏర్పాట్లు చేపట్టామని, వ్యాక్సిన్‌పై ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నట్టు ఆయన చెపారు. ఆర్‌జీ-1లో విఠల్‌నగర్‌ డిస్పెన్సరీ, టీటీసీ, సీఈఆర్‌ క్లబ్‌, ఆర్‌-1కమ్యూనిటీహాల్స్‌లను సందర్శించి వ్యాక్సిన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ మెగా వ్యాక్సిన్‌ క్యాంప్‌లో ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ,ఎన్‌ఓటూ జీఎం త్యాగరాజు, ఏజెంట్లు శ్రీనాథ్‌, చిలుక శ్రీనివాస్‌, డీజీఎం నవీన్‌, మ దన్‌మోహన్‌, ఏసీఎంఓ వెంకటేశ్వర్‌రావు, డీవైపీఎం సలీం, సీనియర్‌ పీఓ సారంగపాణి, హెల్త్‌ ఆఫీసర్‌ పద్మ, శ్రావణ్‌, చక్రవర్తి పాల్గొన్నారు.

వ్యాక్సిన్‌ కేంద్రాన్ని పరిశీలించిన డైరెక్టర్‌(పా)

ఆర్‌జీ-1 పరిధిలో ఏర్పాటు చేసిన మెగా వ్యాక్సిన్‌ క్యాంపును సింగరేణి డైరెక్టర్‌(పా, ఫైనాన్స్‌) బలరాంనాయక్‌ పరిశీలించారు. ఎంత మంది కార్మికులు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు, కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాల పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ కోసం వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు అందించిన సహాయసహకారాలపై అభినందనలు తెలిపారు. డైరెక్టర్‌(పా) వెంట జీఎం కల్వల నారాయణ, డీవైసీఎంఓ వెంకటేశ్వర్‌రా వు, డీవైపీఎం సలీం, సీనియర్‌ పీఓ సారంగపాణి, డాక్టర్‌ మద్దిలేటి, సెక్యూరిటీ ఆఫీసర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - 2021-06-14T06:03:29+05:30 IST