నూతన హంగులతో యాపిల్‌ కొత్త ఐపాడ్‌ మిని

ABN , First Publish Date - 2021-09-18T06:33:08+05:30 IST

యాపిల్‌ సరికొత్త ‘ఐపాడ్‌ మిని’ని తెస్తున్నట్టు ప్రకటించింది. 8.3 ఇంచ్‌ల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేతో వస్తోంది. సరికొత్త ఎ15 బయానిక్‌ చిప్‌ పవర్‌ కలిగి ఉంటుంది...

నూతన హంగులతో యాపిల్‌ కొత్త ఐపాడ్‌ మిని

యాపిల్‌ సరికొత్త ‘ఐపాడ్‌ మిని’ని తెస్తున్నట్టు ప్రకటించింది. 8.3 ఇంచ్‌ల లిక్విడ్‌ రెటీనా డిస్‌ప్లేతో వస్తోంది. సరికొత్త ఎ15 బయానిక్‌ చిప్‌ పవర్‌ కలిగి ఉంటుంది. పాతవాటితో పోల్చుకుంటే, దీని పర్ఫార్మెన్స్‌ వేగం 80 శాతం ఎక్కువ. దీనిలో యూఎస్‌బీ-సి పోర్ట్‌ వేగంగా కనెక్ట్‌ అయ్యేందుకు సహాయపడుతుంది. 5జీతో వచ్చే ఈ సెల్యులర్‌ మోడల్స్‌ పని సాఫీగా సాగేందుకు సహకరిస్తాయి. అడ్వాన్స్‌డ్‌ కెమెరాలు, సెంటర్‌ స్టేజ్‌, రెండో జనరేషన్‌కు చెందిన యాపిల్‌ పెన్సిల్‌కు సపోర్ట్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. న్యూ స్టీరియో స్పీకర్‌ సెటప్‌, న్యూ డిస్‌ప్లేతో మూవీ వీక్షణలోనూ సరికొత్త అనుభవం కలుగుతుంది. ఐపాడ్‌ ఎయిర్‌ మాదిరిగా టాప్‌ బటన్‌కు టచ్‌ ఐడి ఉంటుంది. ఐపాడ్‌ లాకింగ్‌, యాప్స్‌లోకి లాగ్‌ అయ్యేందుకు లేదా యాపిల్‌ పేను ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ పదహారుకోట్ల న్యూరల్‌ ఇంజన్‌ పవర్‌తో పనిచేస్తుంది. ఇంతకుమునుపు ఉన్నదానితో పోల్చుకుంటే వేగంలో 2ఎక్స్‌ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉన్న యూఎస్‌బీ-సి పోర్ట్‌ ఫీచర్‌తో 5జీబీపీఎస్‌ డేటా ఇంతకు మునుపుకంటే పదింతల వేగంతో బదిలీ అవుతుంది. ధరల విషయానికి వస్తే, వైఫై మోడల్స్‌తో ఐపాడ్‌ ఆరంభ ధర రూ.46,900. వైఫై + సెల్యులర్‌ మోడల్స్‌ రూ.60,900. 64 జీబీ, 256 జీబీ కాన్ఫిగరేషన్స్‌తో వస్తున్న ఈ ఐపాడ్‌  - పింక్‌, స్టార్లెట్‌, పర్పుల్‌, స్పేస్‌ గ్రే రంగులతో అందుబాటులో ఉంటాయి. 


Updated Date - 2021-09-18T06:33:08+05:30 IST