అంతా ఓపెన్‌..

ABN , First Publish Date - 2021-06-21T04:25:58+05:30 IST

అంతా ఓపెన్‌..

అంతా ఓపెన్‌..
బస్సులో భౌతికదూరం లేకుండా కూర్చున్న ప్రయాణికులు

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో తెరుచుకున్న ఆలయాలు, మైదానాలు

పూర్తిస్థాయిలో రోడ్డెక్కిన బస్సులు 

నేటినుంచి అంతర్రాష్ట్ర సర్వీసులూ ప్రారంభం

ఖమ్మం ఖానాపురం హవేలీ/ఖమ్మం స్పోర్ట్స్‌, జూన్‌ 20: కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12న లాక్‌డౌన్‌ను విధించింది. ఈ క్రమం లో అన్ని కార్యకలాపాలకు బ్రేక్‌ పడింది. కొన్ని ఆంక్షల మధ్య నిత్యావసరాల విక్రయాలు జరగ్గా.. మిగిలినవన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం 39రోజుల అనంతరం లాక్‌డౌన్‌ను ఎత్తివేసింది. దీంతో ఆదివారం నుంచి అన్నీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇన్ని రోజులు మూసి ఉన్న ఆలయాలు, మైదానాలు, బార్‌ అండ్‌ రెస్టా రెంట్లు అన్నీ తెరుచుకున్నాయి. రాత్రి కర్ఫ్యూ కూడా లేకపోవడంతో రాత్రి సమయంలోనూ గతంలో మాదిరిగా వ్యాపార కార్యకలా పాలు సాగాయి. ఇక ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిస్థాయిలో రోడ ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి అంతర్రాష్ట్ర సర్వీ సులు కూడా ప్రారంభం కానున్నాయి. 

ఉమ్మడిజిల్లాలో రోడ్డెక్కిన 250బస్సులు

లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగించడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం 250బస్సులు రోడ్కెక్కాయి. అద్దె బస్సులను మాత్రం ఇంకా అనుమతించలేదు. రెండు మూడు రోజులలో అవి కూడా సర్వీసులు అందించే అవకాశం ఉంది. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, మధిర, మణుగూరు, భద్రాచలం, కొత్తగూడెం డిపోల నుంచి బస్సు లు ప్రారంభమవడంతో ప్రయాణికుల రద్దీ కనిపించింది. సాధారణ రైలు సర్వీసులు కూడా లేకపోవడం, ఆన్‌లైన్‌లో రిజర్వే షన్‌ చేయించుకుని రైలు ఎక్కాల్సి ఉండటంతో ప్రజలు బస్సులనే అధి కంగా ఆశ్రయిస్తున్నారు. ఇక ఖమ్మంజిల్లా కేంద్రంలో పది సిటీ బస్సులు ప్రత్యేకంగా వివిధ రూట్లలో 150 సర్వీసులు నడిచాయి. సిటీ బస్సులో చార్జి రూ.పది మాత్రమే కావడంతో జనం నుంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఆదివారం సెలవురోజు అయినా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికులతో సందడిగా కనిపించాయి. 

నేటినుంచి ఏపీకి బస్సులు.. 

సోమవారంనుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా ప్రారం భించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినా.. అక్కడ లాక్‌డౌన్‌ ఆంక్షలు అమల్లో ఉండ టంతో ఆ మేరకే బస్సును నడపాలని అధికారులు భావిస్తున్నారు. ఏపీలో ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు లాక్‌డౌన్‌ మినహాయింపు ఉండగా.. ఆ తర్వాత కర్ఫ్యూ అమల్లో ఉంది. దీంతో ఆ సమయాన్ని బట్టి తెలంగాణ బస్సులను నడపనున్నారు. 

ముస్తాబైన 600 ఆలయాలు..

లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఉమ్మడిజిల్లాలోని 600ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. ఆలయ ప్రాంగణాలను విద్యుత్‌ దీపాలు, పూల మాలల తోరణాలతో అలంకరించారు. సాధారణ దర్శనాలతో పాటు ఆర్జిత కైంకర్యాలను చేశారు. అయితే ఇంకా వైరస్‌ భయం ఉన్నం దున మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించడంతోపాటు.. భౌతిక దూరం పాటిస్తూ భక్తులు ఆలయాలకు రావాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. పూజల సమయంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, శఠారి ఆశీర్వచనాలు కల్పించారు. వైరస్‌ ముప్పు తప్పిపోవాలని హిందూ, ముస్లిం, క్రైస్తవులు వారి ఇష్టదైవాలను ప్రార్థించారు.

జమలాపురంలో 25వతేదీ వరకు ఆంక్షలు..

ఉమ్మడి జిల్లాలో అన్ని దేవాలయాలలో దర్శనాలు కొనసాగినా ఎర్రుపాలెం మండలంలోని చిన్నతిరుపతిగా పేరొందిన జమలా పురంలో మాత్రం ఆంక్షలు తప్పలేదు. ఆ ప్రాంతంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో స్థానికంగా గ్రామపంచా యతీ పెద్దలు లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణ యించారు. ఈనెల 25వ తేదీ వరకు అక్కడ ఆంక్షలు ఉండనున్నాయి. దీంతో  వేంకన్న దర్శనానికి భక్తులను అనుమతించరు.

క్రీడా శిక్షణలు పునఃప్రారంభం..

క్రీడా ప్రాంగణాల గేట్లు కూడా తెరుచు కున్నాయి. నగరంలోని సర్ధార్‌ పటేల్‌ స్టేడి యంలో సోమవారం నుంచి క్రీడల శిక్షణలు పునఃప్రారంభం కానున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ తో సుమారు రెండు నెలలుగా నిలిచిన ఆటలు మళ్లీ మొదలు కానుండటంతో క్రీడా కారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియంలో ము ఖ్యంగా అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, క్రికెట్‌, జిమ్నాస్టిక్స్‌, టెన్నీస్‌, స్కేటింగ్‌, వెయిట్‌ లిప్టింగ్‌, ఉషూ, ఆర్చరీ క్రీడలతోపాటు షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడలు ప్రారం భం కానున్నాయి. కాగా స్టేడియంలోని స్విమ్మింగ్‌ పూల్‌ను మాత్రం మరి కొద్దిరోజుల తరువాతే ప్రారం భించనున్నట్టు డీవైఎస్‌ వో పరంధామరెడ్డి తెలిపారు. అయితే కొవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ క్రీడాకారులు, తల్లి దండ్రులు వాకర్లు స్టేడియానికి రావాలని ఆయన కోరారు.

పూర్తిస్థాయిలో మిగిలిన వ్యాపారాలు.. 

లాక్‌డౌన్‌ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో అన్ని వ్యాపారాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. లాక్‌డౌన్‌ లేని సమయంలో ఎలా తమ కార్యకలాపాలు నిర్వహించేవారో.. ఆది వారం నుంచి కూడా అదే రీతిలో వ్యాపార లావాదేవీలు సాగుతు న్నాయి. నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలతో పాటు షాపింగ్‌ మాల్స్‌, బార్‌అండ్‌రెస్టారెంట్లు, మాంసం, మద్యం దుకా ణాలు, వాహన షోరూంలు తదితర అన్ని వ్యాపారాలు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. 



Updated Date - 2021-06-21T04:25:58+05:30 IST