కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-06-22T05:14:20+05:30 IST

కొవిడ్‌ మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుం బాలకు రూ. 10 లక్షలు, ఆక్సిజన్‌ కొరతతో మృతి చెందిన వారికి రూ. 25 లక్షలు ప్రకటించి ఆదుకోవాలని ఏలూరు పార్లమెంటు టీడీపీ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు.

కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు

కలెక్టరేట్‌ వద్ద అఖిలపక్షం ధర్నా 


ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 21: కొవిడ్‌ మహమ్మారితో మృతి చెందిన బాధిత కుటుం బాలకు రూ. 10 లక్షలు, ఆక్సిజన్‌ కొరతతో మృతి చెందిన వారికి రూ. 25 లక్షలు ప్రకటించి ఆదుకోవాలని ఏలూరు పార్లమెంటు టీడీపీ కన్వీనర్‌ గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్‌ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద  ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌, సీపీఐ పార్టీలు పాల్గొన్నాయి. వారు మాట్లాడుతూ తెల్ల రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుం బానికి పది వేలు ఆర్థిక సాయం ప్రకటించాలన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ప్రైవేటు ఉపా ధ్యాయులు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులు, వృత్తిదారులకు నెలకు రూ.7500 అందించాలన్నారు. కొవిడ్‌ బాధితులకు సకాలంలో ఆక్సిజన్‌ కూడా అందించలేని చేతకాని ప్రభుత్వం అని, ఆక్సిజన్‌ మరణా లన్నింటికి ప్రభు త్వమే బాధ్యత వహించాలన్నారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజనాల రామ్మోహ నరావు మాట్లాడుతూ జాబ్‌ క్యాలెండర్‌ను ఎత్తివేసి ఓటు వేసిన యువ తను జగన్‌ మోసం చేశారన్నారు. పాత్రికేయులను కరోనా వారియర్స్‌గా గుర్తించి బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సీపీఐ కార్యదర్శి డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ ఏడాది కాలంగా రాష్ట్రం కొవిడ్‌ కోరల్లో చిక్కుకుని విలవిల్లాడు తోందని ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంద న్నారు. మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్‌, ఆరిమిల్లి రాధాకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అంద జేశారు. టీడీపీ నాయకులు పాలి ప్రసాద్‌, ఉప్పాల జగదీష్‌బాబు, దాసరి ఆంజ నేయులు, నేతల రవి,లంకపల్లి మాణిక్యాలరావు, ఉప్పులూరి చంద్రశేఖర్‌, పూజారి నిరంజన్‌, నెర్సు గంగరాజు, కొల్లేపల్లి రాజు,వేగి ప్రసాద్‌, మాకాల రమేష్‌, సీపీఐ నాయకులు బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T05:14:20+05:30 IST