రాజస్తాన్ మంత్రి వర్గం మొత్తం రాజీనామా

ABN , First Publish Date - 2021-11-21T03:10:15+05:30 IST

గవర్నర్ ఆమోదం అనంతరం నూతన మంత్రివర్గ ప్రకటన వెలువడనున్నట్లు రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా..

రాజస్తాన్ మంత్రి వర్గం మొత్తం రాజీనామా

జైపూర్: మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాజస్తాన్ ప్రభుత్వ మంత్రివర్గం శనివారం రాజీనామా చేసింది. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని సంపూర్ణ మంత్రివర్గం రాజీనామా చేసింది. ఈ విషయాన్ని గెహ్లాట్ మంత్రివర్గంలోని ఒకరైన ప్రతాప్ ఖచారియావాస్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని జైపూర్‌‌లో ముఖ్యమంత్రి నివాసంలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. కాగా, నూతన మంత్రివర్గ ఏర్పాటు నిమిత్తం గెహ్లాట్ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌ భవన్ చేరుకున్నట్లు సమాచారం.


గెహ్లాట్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు



గవర్నర్ ఆమోదం అనంతరం నూతన మంత్రివర్గ ప్రకటన వెలువడనున్నట్లు రాజస్తాన్ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా ఉండనుందని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కొత్తగా ఎవరెవరికి కేబినెట్‌లో చోటు కల్పించనున్నారనేది ఇంకా స్పష్టం కానప్పటికీ , శుక్రవారం సాయంత్రం నుంచి ఎమ్మెల్యేలందరితో మంతనాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.

Updated Date - 2021-11-21T03:10:15+05:30 IST