Abn logo
Oct 17 2021 @ 22:26PM

గాంధీ ఆశ్రమంలో సర్వ మత ప్రార్థనలు

గాంధీ విగ్రహానికి నూలు మాల వేస్తున్న మంజుల, విద్యార్థులు

ఇందుకూరుపేట, అక్టోబరు 17 : మండలంలోని పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిగాయి. కో కన్వీనర్‌ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ముందుగా గంపల మంజుల, స్కూల్‌ విద్యార్థులు, గాంధీ, పొణకా కనకమ్మ విగ్రహాలకు ఖాదీ వస్త్రం, నూలు మాలలు సమర్పించారు.  గాంధీ ఆశయాలు, సిద్ధాంతాల గురించి రవీంద్రరెడ్డి  వివరించారు. కార్యక్రమంలో కోర్‌ కమిటీ సభ్యులు గణేశం సుమంత్‌రెడ్డి, మేనేజర్‌ సాయిమనోజ్‌, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.