ఆర్టీఏ కార్యాలయంలో అన్ని సేవలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-08T07:28:12+05:30 IST

అన్ని రకాల ఆర్టీఏ సేవలు గురువారం నుంచి పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వచ్చాయిని డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ తెలిపారు.

ఆర్టీఏ కార్యాలయంలో అన్ని సేవలు ప్రారంభం

తిమ్మాపూర్‌, మే 7: అన్ని రకాల ఆర్టీఏ సేవలు  గురువారం నుంచి పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వచ్చాయిని డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవర్లకు కరోన వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు రవాణా శాఖ తరపున ప్రొటెక్షన్‌ కిట్‌లను ఆయన అందజేశారు. ఈ సందర్బంగా  మాట్లాడుతు ఉమ్మడి జిల్లాలో గురువారం 175 స్లాట్‌లు బుక్‌ అయ్యాయని  తెలిపారు. ఆర్టీఏ కార్యాలయానికి వచ్చే వారు తప్పని సరిగా మాస్క్‌లు ధరించాలని, లేకపోతే లోనికి అనుమతించమని తెలిపారు. వాహనదారులు బుక్‌ చేసుకున్న సమయానికే కార్యాలయానికి రావాలని సూచించారు.

Updated Date - 2020-05-08T07:28:12+05:30 IST