Advertisement
Advertisement
Abn logo
Advertisement

పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలి

కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

హత్నూర, డిసెంబరు 2 : కాంగ్రెస్‌ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌ అన్నారు. మండల పరిధిలోని దౌల్తాబాద్‌లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సాపూర్‌ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సభ్యత్వ నమోదును ప్రతిష్టగా చేపట్టాలన్నారు. మొత్తం 302 బూత్‌లు ఉండగా.. ప్రతి బూత్‌కు వందమంది సభ్యత్వాలు చేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హకీం, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ అధ్యక్షుడు రియాజ్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు పొట్లచెర్వు కిష్టయ్య, దౌల్తాబాద్‌ సర్పంచ్‌ కొన్యాల వెంకటేశం, నాయకులు సత్యం, కృష్ణ, యాదాగౌడ్‌, మణిదీప్‌, సందీప్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement