అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

ABN , First Publish Date - 2020-06-04T09:23:44+05:30 IST

అర్హులైన లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ కోసం ఎంత ఖర్చైనా భూములను కొనుగోలు చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ..

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు

 స్పీకర్‌ తమ్మినేని సీతారాం


 పొందూరు, జూన్‌ 3 :అర్హులైన లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ కోసం ఎంత ఖర్చైనా భూములను కొనుగోలు చేయాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు.బుధవారం పొందూరు పంచాయతీ పరిధిలోని ఇళ్లపట్టాల లబ్ధిదారుల కోసం సేకరించిన భూములను  పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి 27 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు.  పేదలకు ఇళ్లస్థలాల పంపిణీకి  ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. తొలుత రాపాకలో తాగునీటి పఽథకాన్ని ప్రారంభించారు.  


నేరుగా సేవలకోసమే రైతు భరోసా కేంద్రాలు

రైతులు అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరగకుండా నేరుగా సేవలు  అందించేందుకే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నట్లు    స్పీకర్‌ తమ్మినేని సీతారాం తెలిపారు. బుధవారం పొందూరు  ఏఎంసీ కార్యాలయంలో  వరి విత్తనాలు పంపిణీచేశారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్‌, వైసీపీ మండలాధ్యక్షుడు  కొంచాడ రమణమూర్తి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు పప్పల రమణమూర్తి, సువ్వారి గాంధీ,లోలుగు కాంతారావు, లోలుగు శ్రీరాములనాయుడు, పట్టణాధ్యక్షులు జి.నాగ రాజు, జి.మోహన్‌ మురళీకృష్ణ,  ఎంపీడీవో రేణుక, ఇన్‌చార్జి తహసీల్దార్‌ మధు, ఈవోఆర్డీ రజని, ఏవో బి.బాబ్జి   పాల్గొన్నారు.


 ప్రైవేటు భూములు కొనుగోలు సరికాదు

పొందూరు పరిధిలో 42 సర్వే నంబరులో భారీగా ప్రభుత్వభూములు ఉన్నా యని, కానీ రెవెన్యూఅధికారులు ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎకరాకు రూ.30 లక్ష లకు పైగా వెచ్చించి భూములు కొనుగోలు చేయడం ఏమిటని  వైసీపీ రాష్ట్ర సం యుక్త కార్యదర్శి సువ్వారి గాంఽధీ ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలను పరిశీలించేందుకు బుధవారం పొందూరు వచ్చిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం దృష్టికి ఈ విషయాన్ని ఆయన తీసుకెళ్లారు. ఈ ప్రాంతంలో భూముల ధర రూ.10 లక్షలలోపే ఉంటుం దని, అటువంటిది 30 లక్షలకు కొనుగోలుచేయడం అవసరమా అని నిలదీశారు.   తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని స్పీకర్‌కు తెలిపారు. కాగా, భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో అధికార పార్టీ నాయకులే స్పీకర్‌ దృష్టికి తీసుకురావడం విశేషం.

Updated Date - 2020-06-04T09:23:44+05:30 IST