ఇవన్నీ జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయి: చినరాజప్ప

ABN , First Publish Date - 2021-01-17T20:07:56+05:30 IST

ప్రవీణ్ చక్రవర్తితో జగన్ బావ అనిల్‌కు సంబంధాలున్నాయని మాజీమంత్రి, టీడీపీ నేత చిన్నరాజప్ప ఆరోపించారు.

ఇవన్నీ జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయి: చినరాజప్ప

రాజమండ్రి: ప్రవీణ్ చక్రవర్తితో జగన్ బావ అనిల్‌కు సంబంధాలున్నాయని మాజీమంత్రి, టీడీపీ నేత చిన్నరాజప్ప ఆరోపించారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇవన్నీ సీఎం జగన్ డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని మండిపడ్డారు. దేవుళ్ల దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రజలు చెప్పినా డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదన్నారు. డీజీపీ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. దాడుల వెనక సంఘ విద్రోహ శక్తులని ఒక రోజు.. మరొక రోజు టీడీపీ, బీజేపీకి సంబంధం ఉందని చెపుతున్నారన్నారు. ప్రవీణ్ చక్రవర్తిని అరెస్టు చేయకుండా ఏడాది కాలంగా ఏం చేశారని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేశారా లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. సీఐడీ విచారణ జరుగుతోందా లేదో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడిన వీడియో సందేశంపై పూర్తి విచారణ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చిన్నరాజప్ప పేర్కొన్నారు.

Updated Date - 2021-01-17T20:07:56+05:30 IST