Abn logo
Sep 27 2021 @ 00:37AM

America లో ఆ తరహా పెళ్లిళ్లకు పెరుగుతున్న మద్దతు.. యూఎస్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా..

వాషింగ్టన్: అమెరికాలో వర్ణాంతర(Interracial) సంబంధాలకు మద్దతు పెరుగుతోంది. దేశంలో ఎన్నడూ లేని స్థాయిలో నల్లజాతీయులు-తెల్లజాతీయుల మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఇష్టత చూపిస్తున్నారు. దేశంలో వర్ణాంత సంబంధాలపై ప్రజలు ఏ స్థాయిలో మద్దతు తెలుపుతున్నారనే విషయంపై గాల్లప్(Gallup) అనే సంస్థ సర్వే నిర్వహిస్తూ వస్తోంది. 2004లో నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది ఈ తరహా సంబంధాలకు, వివాహాలకు మద్దతుగా నిలిచారు. 28 శాతం మంది వ్యతిరేకించారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో దేశంలోని యువతను దీనిపై ప్రశ్నించగా 42 శాతం మంది మాత్రమే తప్పులేదని చెప్పారు. 58 శాతం మంది వర్ణాంతర సంబంధాలు సరికాదని చెప్పడం గమనార్హం.

అయితే గాల్లప్ సంస్థ తాజాగా ఇదే విషయంపై మళ్లీ పోల్ నిర్వహించింది. అందులో అత్యధికంగా 94 శాతం ప్రజలు వర్ణాంతర వివాహాలకు మద్దతుగా నిలిచారు. అమెరికా చరిత్రలో ఇది అత్యధికం. 63 ఏళ్ల క్రితం అమెరికాలో వర్ణాంత వివాహాలపై తీవ్రమైన వ్యతిరేక భావం ప్రజల్లో ఉండేది. అప్పట్లో కేవలం 4 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలిచేవారు. అయితే 1967లో సుప్రీం కోర్టు సాక్షిగా వర్ణాంత వివాహాలను అధికారికం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల జీవన విధానంలో ఆలోచనా విధానంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే వర్ణాంతర వివాహాలపై వ్యతిరేకత తగ్గింది. ప్రస్తుతం కేవలం 6 శాతం మంది తెల్లజాతీయులు మాత్రమే నల్లజాతీయులతో సంబంధాన్ని కొనసాగించడాన్ని తప్పుగా చూస్తున్నారు.

కాగా.. అమెరికాలోని పశ్చిమ భాగంలో వర్ణాంత వివాహాలను అత్యధికంగా ప్రజల నుంచి ఆమోదం లభిస్తోంది. 97 శాతం ప్రజలు ఇలాంటి వివాహాలకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే దక్షిణ భాగంలో మాత్రం 93 శాతం మంది మాత్రమే మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...