Abn logo
Sep 25 2021 @ 22:49PM

అన్ని రకాల వైద్య సేవలు అందించాలి

వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌

- కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌
బెజ్జూరు, సెప్టెంబరు 25: మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలను అందించాలని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని ఆపరేషన్‌ థియేటర్‌, మందుల గది, మందులను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌ పరిశీలించిన సమయంలో కాలం చెల్లిన వస్తువులు ఉండడంతో వాటిని వినియోగించవద్దని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో ప్రసవం అయిన తల్లీబిడ్డలకు అందించాల్సిన వైద్య పరీక్షలపై ఆరా తీశారు. శిశువుకు నంజు తీసే పరికరాలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని సూచించారు. రక్తం, మూత్రపరీక్షలు నిర్వహించే విధానంపై సిబ్బంది అవగాహన కల్పించారు. ఆయన వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌, డాక్టర్‌ రుషి, డాక్టర్‌ ముస్తాఫా, సూపర్‌వైజర్లు అశోక్‌, రవిరాజ్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ ధర్మారాం, హెచ్‌ఈవో కోటేష్‌,  విజిత, ఫార్మాసిస్టు అయేషా తబసుం ఉన్నారు.
కౌటాల: మండల కేంద్రంలోని పీహెచ్‌సీని శనివారం కేంద్ర హెల్త్‌ టీం జాయింట్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకన్నారు. మా తా శిశు మరణాలు తగ్గించాలని, రక్తహీనత లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట టీం సభ్యులు రవీందర్‌, డిప్యూటీ డీఎం హెచ్‌వో సీతారాంనాయక్‌, వైద్య సిబ్బంది సునీల్‌రావు, ప్రేంసా గర్‌, వైద్యులు పల్లవీ, కృష్ణప్రసాద్‌, అశ్విని ఉన్నారు.