‘ఆర్థిక ప్రభావ చెల్లింపు గురించి మీరు తెలుసుకోవలసినది’

ABN , First Publish Date - 2020-04-18T22:56:36+05:30 IST

కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి అకస్మాత్తుగా విరుచుకుపడటంతో, అత్యధిక వ్యాపారాలు,

‘ఆర్థిక ప్రభావ చెల్లింపు గురించి మీరు తెలుసుకోవలసినది’

కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారి అకస్మాత్తుగా విరుచుకుపడటంతో, అత్యధిక వ్యాపారాలు, ఆదాయాన్ని సృష్టించే ఇతర వనరులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఫలితంగా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రోజు కూలీలు మొదలైనవారు ఆదాయాన్ని కోల్పోయారు, నిరుద్యోగులయ్యారు. ఇది వారి జీవనోపాధి నిర్వహణలో ఇబ్బందులకు దారి తీస్తుంది.


ఈ అసాధారణ పరిస్థితిలో, కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ప్రజలకు సహాయపడేందుకు ఐఆర్ఎస్ అనేక సహాయ చర్యలు చేపడుతోంది. వీటిలో ఒకటి ‘ఆర్థిక ప్రభావ చెల్లింపు’ జారీ, ఇది కచ్చితంగా 75,000 డాలర్ల కన్నా తక్కువ ఆదాయంగల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు (150,000 డాలర్ల జాయింట్ ఫైలర్స్‌కు) గొప్ప ఉపశమనం కాగలదు.


‘ఆర్థిక ప్రభావ చెల్లింపు’ (ఎకనమిక్ ఇంపాక్ట్ పేమెంట్) అంటే ఏమిటి? కరోనా వైరస్ సహాయక చర్యల్లో భాగంగా ఐఆర్ఎస్ ప్రకటించిన ఏక కాలిక చెల్లింపు పథకం ఇది. నిర్ణీత నిబంధనలకు అనుగుణంగా ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు ఈ చెల్లింపును పొందేందుకు అర్హులవుతారు.



చెల్లింపు సొమ్ము, అర్హత నిబంధనలు :

వ్యక్తిగత (లేదా కుటుంబ పెద్ద) రెసిడెంట్ ఫైలర్స్ 1200 డాలర్లు పొందేందుకు అర్హులు, ‘మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్‌లీ’ ఫైలర్స్ 2400 డాలర్లు పొందేందుకు అర్హులు. అయితే వారు వేరొక పన్ను చెల్లింపుదారుపై ఆధారపడినవారు అయి ఉండకూడదు. వ్యక్తులు (సింగిల్/ఎంఎఫ్ఎస్)కు 75,000 డాలర్ల వరకు; కుటుంబ పెద్ద (హెచ్ఓహెచ్)కు 112,500 డాలర్ల వరకు, మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్ (ఎంఎఫ్‌జే) రిటర్న్స్‌కు అడ్జస్టెడ్ గ్రాస్ ఇన్‌కమ్‌తో వర్క్ ఎలిజిబుల్ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉండాలి. దీంతోపాటు వీరు అదనంగా ఒక్కొక్క క్వాలిఫయింగ్ చైల్డ్‌కు 500 డాలర్లకు అర్హులవుతారు.


ఫైలింగ్ స్టేటస్ ‘సింగిల్’ లేదా ‘మ్యారీడ్ ఫైలింగ్ సెపరేట్‌లీ’ అయినట్లయితే, వారి ఏజీఐ 75,000 డాలర్ల నుంచి 99,000 డాలర్ల మధ్య ఉన్నట్లయితే; కుటుంబ పెద్ద (హెడ్ ఆఫ్ హౌస్‌హోల్డ్)కు ఏజీఐ 112,550 నుంచి 136,500 మధ్య ఉన్నట్లయితే; ‘మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ’కి 150,000 డాలర్ల నుంచి 198,000 డాలర్ల మధ్యలో ఉన్నట్లయితే, ఈ పన్ను చెల్లింపుదారులు తక్కువ చెల్లింపును పొందుతారు. 


వీటితోపాటు అర్హులైన రిటైర్ అయినవారు, సోషల్ సెక్యూరిటీ పొందేవారు, రైల్ రోడ్ రిటైర్‌మెంట్, డిజెబిలిటీ లేదా వెటరన్స్ బెనిఫిట్స్ పొందేవారు, అదేవిధంగా సాధారణంగా పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి అవసరమైన సొమ్మును సంపాదించలేని పన్ను చెల్లింపుదారులు పేమెంట్‌ (చెల్లింపు)ను పొందుతారు. దీనిలోకి అసలు ఆదాయం లేనివారు, అదేవిధంగా సప్లిమెంటల్ సెక్యూరిటీ ఇన్‌కమ్ బెనిఫిట్స్ వంటి కొన్ని బెనిఫిట్ ప్రోగ్రాముల నుంచి తమ పూర్తి ఆదాయాన్ని పొందేవారు వస్తారు.


సోషల్ సెక్యూరిటీ రిటైర్‌మెంట్ లేదా రైల్‌రోడ్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ పొందే రిటైరీస్ కూడా పేమెంట్స్ ఆటోమేటిక్‌గా పొందుతారు.


ఈ ఎకనమిక్ ఇంపాక్ట్ పేమెంట్‌ను పొందేందుకు చెల్లుబాటు అయ్యే సోషల్ సెక్యూరిటీ నంబర్ లేనివారు, లేదా, నాన్-రెసిడెంట్ ఎలీన్, లేదా, ఫారం 1040-ఎన్ఆర్ లేదా ఫారం 1040-ఎన్ఆర్-ఈజెడ్, ఫారం 1040-పీఆర్ లేదా ఫారం 1040-ఎస్ఎస్ దాఖలు చేసినవారు అర్హులు కారు. వేరొకరి రిటర్నులో డిపెండెంట్‌గా పేర్కొన్నవారు కూడా ఈ పేమెంట్ పొందేందుకు అర్హులు కారు.



ఫస్ట్ టైమ్ ఫైలర్స్, ఎకనమిక్ ఇంపాక్ట్ పేమెంట్ :


సాధారణంగా, టీవై2019 రెసిడెంట్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను ఇప్పటికే దాఖలు చేసినవారు, లేదా, టీవై2019 రెసిడెంట్ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేయకుండా టీవై2018 ట్యాక్స్ రిటర్న్‌స్‌ను దాఖలు చేసినవారు ఈ ఎకనమిక్ ఇంపాక్ట్ పేమెంట్‌ను పొందేందుకు ఎటువంటి అదనపు చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు. ఇప్పటికే దాఖలైన టీవై2019/టీవై2018 ట్యాక్స్ రిటర్న్‌స్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా పేమెంట్‌ను ఐఆర్ఎస్ చేస్తుంది.


ఈ పేమెంట్‌ను పొందేందుకు అమెరికాలో మొదటిసారి టీవై2019లో తమ వ్యక్తిగత ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్‌ను దాఖలు చేయవలసిన అవసరం ఉన్నవారు (పొడిగించిన గడువు తేదీ) 2020 జూలై 15నాటికి దాఖలు చేయవచ్చు, అయితే మీరు ఈ పేమెంట్‌ను సాధ్యమైనంత త్వరగా మీ ట్యాక్స్ రిటర్న్‌స్‌లో చూపిన ఏదైనా రిఫండ్‌తో సహా పొందేందుకు వీలుగా సాధ్యమైనంత త్వరగా మీ రిటర్నులను దాఖలు చేయాలని సలహా ఇవ్వడమైనది.


ఎకనమిక్ ఇంపాక్ట్ పేమెంట్‌పై తదుపరి ప్రశ్నలు ఏమైనా ఉంటే, మీరు https://www.universalfinancials.com ను సంప్రదించవచ్చు లేదా contact@universalfinancials.comకు రాయవచ్చు.


అమెరికా ఇండివిడ్యువల్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, పేరోల్ సర్వీసెస్, ఇతర అనుబంధ సేవలు అందజేయడంలో నైపుణ్యంగల సంస్థ మాది.


పీ.ఎస్ : ఇంటర్నల్ రెవిన్యూ సర్వీస్ ప్రకటించిన కరోనా వైరస్ సహాయక చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాత్రమే ఈ ప్రకటనను విడుదల చేస్తున్నాం.



ప్రెస్ రిలీజ్ బై : ఇండియన్ క్లిక్స్, ఎల్ఎల్‌సీ

Updated Date - 2020-04-18T22:56:36+05:30 IST