జగన్‌పై ప్రసంశలు గుప్పించిన ఆళ్లనాని

ABN , First Publish Date - 2020-10-01T01:15:02+05:30 IST

సీఎం జగన్‌పై మంత్రి ఆళ్ల నాని ప్రసంశలు గుప్పించారు. కరోనా కట్టడిలో జగన్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

జగన్‌పై ప్రసంశలు గుప్పించిన ఆళ్లనాని

అమరావతి: సీఎం జగన్‌పై మంత్రి ఆళ్ల నాని ప్రసంశలు గుప్పించారు. కరోనా కట్టడిలో జగన్ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గాయని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని తప్పుబట్టారు. ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అని.. చంద్రబాబు, లోకేష్‌ ఆందోళన చెందుతున్నారని ఎద్దేవాచేశారు. చంద్రబాబు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వెళ్లిపోయారని ఆరోపించారు. కోర్టులో కేసులు వేసి ఇళ్లపట్టాల పంపిణీని అడ్డుకున్నారని తెలిపారు. ప్రధాని సైతం ఏపీలో కరోనా నివారణ కార్యక్రమాలను మెచ్చుకున్నారని గుర్తుచేశారు. చంద్రబాబు ఇప్పటికైనా రాజకీయాలు ఆపాలని ఆళ్లనాని హితవుపలికారు.



Updated Date - 2020-10-01T01:15:02+05:30 IST