రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వివరణ

ABN , First Publish Date - 2021-06-14T14:10:06+05:30 IST

రామాలయ ప్రాంగణం కోసం పెంచిన ధరలకు విలువైన భూమిని కొనుగోలు చేశారని ప్రతిపక్ష పార్టీలు చేసిన మోసం ఆరోపణలను...

రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వివరణ

రాజకీయ ద్వేషంతోనే అవినీతి ఆరోపణలు...

అయోధ్య (ఉత్తరప్రదేశ్): రామాలయ ప్రాంగణం కోసం పెంచిన ధరలకు విలువైన భూమిని కొనుగోలు చేశారని ప్రతిపక్ష పార్టీలు చేసిన మోసం ఆరోపణలను శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఖండించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఆరోపణలను రాజకీయ ద్వేషంతో తప్పుదోవ పట్టించేదిగా  ప్రేరేపించబడిందని చంపత్‌రాయ్ పేర్కొన్నారు.శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు ఇప్పటివరకు కొనుగోలు చేసిన అన్ని భూములు బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు కొనుగోలు చేశామని ఆయన వివరించారు. 


ప్రతిపక్షాల ఆరోపణలకు రాయ్ సమాధానమిచ్చారు. 2019 నవంబరు 9వతేదీన శ్రీరామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజలు భూమిని కొనడానికి అయోధ్యకు రావడం ప్రారంభించారని, దీంతో భూముల ధరలు పెరిగాయని చెప్పారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ఇప్పటివరకు కొనుగోలు చేసిన భూమి బహిరంగ మార్కెట్ ధర కంటే చాలా తక్కువని చెప్పారు. పరస్పరం మాట్లాడుకొని వారి సమ్మతి ఆధారంగా భూమిని కొనుగోలు చేసి ఆన్‌లైన్ లో విక్రేత ఖాతాకు డబ్బు బదిలీ చేశామని రాయ్ చెప్పారు. 


కొంతమంది రాజకీయ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, రాజకీయ ద్వేషంతోనే ఈ ఆరోపణలు చేశారని చెప్పారు.సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు తేజ్ నారాయణ్ పాండే రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ పై అవినీతి ఆరోపణలు చేసి, దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.రాముడి పేరిట అవినీతి జరుగుతుందని పలువురు ఆరోపించిన నేపథ్యంలో రాయ్ వివరణ ఇచ్చారు.

Updated Date - 2021-06-14T14:10:06+05:30 IST