UP elections: ఎస్పీ-ఎస్‌బీఎస్పీ మధ్య పొత్తు

ABN , First Publish Date - 2021-10-21T00:31:39+05:30 IST

ఎస్పీబీఎస్పీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ బుధవారం ఎస్పీ అధినేత అఖిలేష్‌ను కలుసుకున్నారు. లఖ్‌నవూలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఈ రెండు పార్టీలకు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకే ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లు ఓం ప్రకాష్ రాజ్‌భర్ ప్రకటించారు..

UP elections: ఎస్పీ-ఎస్‌బీఎస్పీ మధ్య పొత్తు

లఖ్‌నవూ: దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కాగా, అధికారంలోని భారతీయ జనతా పార్టీ సహా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు ఎత్తులు పై ఎత్తులకు పని చెబుతున్నాయి. తాజాగా సుహేల్‌దేవ్ సుహేల్‌దేవ్ బహుజన్ సమాజ్‌ పార్టీతో సమాజ్‌వాదీ పార్టీ జత కట్టింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో ఎన్నికల బరిలోకి దిగిన ఎస్పీ.. అసెంబ్లీ ఎన్నికలకు ఎస్‌బీఎస్పీతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించుకుంది.


ఎస్పీబీఎస్పీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ బుధవారం ఎస్పీ అధినేత అఖిలేష్‌ను కలుసుకున్నారు. లఖ్‌నవూలోని ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఈ రెండు పార్టీలకు మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకే ఇరు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లు ఓం ప్రకాష్ రాజ్‌భర్ ప్రకటించారు. అక్టోబర్ 27న మౌలో నిర్వహించే మహాపంచాయత్‌కు అఖిలేష్‌ను ఆహ్వానించినట్లు, అక్కడి నుంచే తమ ఉమ్మడి ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-10-21T00:31:39+05:30 IST