ఇంట్లోకి మొసలి వచ్చిందంటూ పోలీసులకు ఫోన్.. అక్కడకు వెళ్లి చూస్తే షాక్

ABN , First Publish Date - 2020-09-11T01:04:45+05:30 IST

ఫ్లోరిడాలో ఎక్కడపడితే అక్కడ మొసళ్లు దర్శనమిస్తుంటాయి. ఈ రాష్ట్రంలోని కొన్ని

ఇంట్లోకి మొసలి వచ్చిందంటూ పోలీసులకు ఫోన్.. అక్కడకు వెళ్లి చూస్తే షాక్

ఆర్లాండో: ఫ్లోరిడాలో ఎక్కడపడితే అక్కడ మొసళ్లు దర్శనమిస్తుంటాయి. ఈ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మొసళ్లు ఏకంగా రోడ్డుపై వెళ్తూ కూడా కనిపిస్తుంటాయి. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల ఫ్లోరిడాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. తమ ఇంటి గ్యారేజ్‌లో పెద్ద మొసలి ఉందంటూ ఓ జంట పోలీసులకు ఫోన్ చేసింది. మొసలిని పట్టుకునేందుకు హుటాహుటిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. తీరా గ్యారేజ్‌లోకి వెళ్లి చూడగా.. అక్కడ నిజమైన మొసలి లేనేలేదు. పైనున్న ఫొటోలో మొసలి ఫొటోను చూడవచ్చు. ఫొటోలో భయంకరమైన మొసలి కనిపిస్తున్నప్పటికి అది మొసలిలా కనిపిస్తున్న బొమ్మ. 


గ్యారేజ్‌లో బొమ్మ మొసలిని చూసిన పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. గాలి నింపి నీటిలో ఆడుకునే మొసలి బొమ్మను చూసి తాము భయపడ్డామా అని మరోపక్క పోలీసులకు సమాచారమిచ్చిన జంట కంగుతింది. గ్యారేజ్‌లోకి వెళ్లిన సమయంలో ఆ బొమ్మ కనపడటంతో.. నిజమైన మొసలి అనుకుని భయానికి లోనయ్యామని జంట చెప్పుకొచ్చింది. కాగా.. పోలీసులు ఈ బొమ్మ మొసలి ఫొటోను తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - 2020-09-11T01:04:45+05:30 IST