Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలిండియా చెస్‌ చాంపియన్‌ విశాఖ స్టీల్‌ప్లాంట్‌

ఉక్కుటౌన్‌షిప్‌, డిసెంబరు 3: స్టీల్‌ప్లాంట్‌ క్రీడా మైదానంలో జరిగిన ఆలిండియా ఇంటర్‌ స్టీల్‌ప్లాంట్‌ల చెస్‌ చాంపియన్‌షిప్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌ జట్టు కైవసం చేసుకుంది. రన్నరప్‌ ట్రోఫీని రూర్కెల జట్టు గెలుచుకుంది. దేశ వ్యాప్తంగా ఎనిమిది స్టీల్‌ప్లాంట్‌ల నుంచి క్రీడా జట్లు పాల్గొన్నాయి. శుక్రవారం ఉక్కు స్టేడియంలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎండీ అతుల్‌భట్‌ ముఖ్య అతిఽథిగా విచ్చేసి మాట్లాడారు. ఇంటర్‌ స్టీల్‌ప్లాంట్‌ల పోటీలను ఇక్కడ నిర్వహించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్‌లు కేకే ఘోష్‌, ఏకే సక్సేనా, సీజీఎం(మెడికల్‌) కేహెచ్‌.ప్రకాశ్‌, జీఎం(సీసీ) ఆర్‌పీ శర్మ, క్రీడా విభాగాధిపతి ఎంఎస్‌ కుమార్‌, డీజీఎం(ఎఫ్‌అండ్‌ఏ) ఏకే పాండే, కో-ఆర్డినేటర్‌ ఎంఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు. 


Advertisement
Advertisement