‘అంబేడ్కర్‌ విగ్రహానికి స్థలం కేటాయించాలి’

ABN , First Publish Date - 2021-06-24T05:50:38+05:30 IST

పాములపాడు మండలం బానుముక్కుల గ్రామంలో డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని బానుముక్కుల సర్పంచ్‌ కృష్ణవేణికి గ్రామ యూత్‌ సభ్యులు మూల చెన్నయ్య, వెంకటయ్య, దివాకర్‌, అనిల్‌, అరవింద్‌, బుజ్జన్న బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.

‘అంబేడ్కర్‌ విగ్రహానికి స్థలం కేటాయించాలి’

పాములపాడు, జూన్‌ 23: పాములపాడు మండలం బానుముక్కుల గ్రామంలో డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని బానుముక్కుల సర్పంచ్‌ కృష్ణవేణికి గ్రామ యూత్‌ సభ్యులు మూల చెన్నయ్య, వెంకటయ్య, దివాకర్‌, అనిల్‌, అరవింద్‌, బుజ్జన్న బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా యూత్‌సభ్యులు మాట్లాడుతూ బానుముక్కుల గ్రామంలో ప్రధాన రహదారి సెంటరులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని విగ్రహ ఏర్పాటుకు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగార్జు రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T05:50:38+05:30 IST