రాష్ట్రానికి నలుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-01-21T06:45:07+05:30 IST

కేంద్ర హోంశాఖ తెలంగాణకు నలుగురు ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. 73(ఆర్‌ఆర్‌) బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులకు కేంద్రం కేడర్‌ అలాట్‌ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన

రాష్ట్రానికి నలుగురు ఐపీఎస్‌ల కేటాయింపు

హైదరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ తెలంగాణకు నలుగురు ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. 73(ఆర్‌ఆర్‌) బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారులకు కేంద్రం కేడర్‌ అలాట్‌ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి కేటాయించిన నలుగురు ఐపీఎస్‌ అధికారుల్లో ఒకరు తెలంగాణకు చెందినవారు ఉన్నారు. పరితోష్‌ పంకజ్‌(బిహార్‌), సిరిసెట్టి సంకీర్త్‌(తెలంగాణ), పాటిల్‌ కాంతిలాల్‌ సుభా్‌ష(మహారాష్ట్ర), అంకిత్‌ కుమార్‌ శంకవర్‌(మహారాష్ట్ర)ను రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ కేటాయించింది. కాగా, తెలంగాణకు చెందిన వారిలో ఎంవీ సత్యసాయి కార్తిక్‌, ఆర్‌.శీతల్‌ కుమార్‌, రాజనాల స్మృతిక్‌ను మహారాష్ట్ర, అసోం, చత్తీ్‌సగఢ్‌కు కేంద్రం అలాట్‌ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణకు ఐపీఎస్‌ అధికారుల అవసరం ఉందని గతంలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించిన నేపథ్యంలో ఏపీతో పోల్చితే తెలంగాణకు ఎక్కువ అధికారుల్ని కేటాయిస్తోంది. 73(ఆర్‌ఆర్‌) బ్యాచ్‌కు చెందిన ముగ్గురిని ఏపీకి కేటాయించారు. 

Updated Date - 2021-01-21T06:45:07+05:30 IST