అసంపూర్తి మిల్లుకు ధాన్యం కేటాయింపు

ABN , First Publish Date - 2021-07-25T04:19:04+05:30 IST

ఆ మిల్లు నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉన్నది..

అసంపూర్తి మిల్లుకు ధాన్యం కేటాయింపు
వనపర్తి మండలం నాచహళ్లిలో అసంపూర్తిగా ఉన్న ఓ జిల్లా స్థాయి అధికారి బంధువులకు చెందిన మిల్లు

- ఓ జిల్లా స్థాయి అధికారి బంధువుల మిల్లుపై అధికారుల ప్రేమ

- నిర్మాణం పూర్తికాక ముందే 20,388 మెట్రిక్‌ టన్నుల ధాన్యం

- చట్టం ప్రకారం 90 రోజుల్లో బియ్యం ఇవ్వడం సాధ్యమేనా? 


వనపర్తి, జూలై 24 (ఆంధ్రజ్యోతి) : ఆ మిల్లు నిర్మాణం ఇంకా పునాది దశలోనే ఉన్నది.. ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఒక గోదాం నిర్మాణమే పూర్తైంది.. కానీ, వనపర్తి జిల్లా పౌర సరఫరాల శాఖ యంత్రాంగం మాత్రం, ధాన్యాన్ని కేటాయించింది.. దీనికి ఓ కారణం ఉన్నది.. ఈ మిల్లు ఓ జిల్లా స్థాయి అధికారి బంధువులది.. ఒక రకంగా ఓనర్‌గా ఉన్నది సదరు జిల్లా స్థాయి అధికారే.. అందుకే అధికారులు ఆ మిల్లుపై వల్లమాలిన అభిమానం చూపించారు.. చర్యలు తీసుకునే వారు ఎవరూ ఉండరని గడిచిన యాసంగిలో 20,388 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయించారు.. 

వనపర్తి జిల్లాలో ఏటికేడు ప్రాజెక్టులు పూర్తవు తూ ఆయకట్టు పెరుగుతోంది. ఇన్ని రోజులు ఆరుత డి పంటలు సాగు చేసిన రైతులు మెజారిటీ వరి సా గు వైపు మళ్లుతున్నారు. దీంతో రెండు సంవత్సరాల్లో ధాన్యం దిగుబడి రెట్టింపు అయ్యింది. అయితే, అందు కు తగ్గట్లుగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు జిల్లాలో లేవు. ప్రతీ ఏటా దిగుబడి పెరుగుతుండటంతో ఇక్కడ సే కరించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం బాయిల్డ్‌ రైస్‌ మి ల్లులు ఎక్కువగా ఉన్న సూర్యాపేట, సంగారెడ్డి, న ల్గొండ జిల్లాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వం కూడా మిల్లులను పెంచడం, వాటి సామర్థ్యాలను పెంచడం పై దృష్టి సారించింది. కొత్తగా బాయిల్డ్‌ రైస్‌మిల్లులు ఏర్పాటు చేసే వారికి సబ్సిడీ కూడా ఇచ్చేందుకు సు ముఖంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ధాన్యం దిగుబడు లు అధికంగా వస్తున్న వనపర్తి జిల్లాలో మిల్లు ఏర్పా టు చేయాలని ఓ జిల్లా స్థాయి అధికారి భావించా డు. వనపర్తి మండలం నాచనహళ్లి వద్ద సర్వే నంబ ర్‌ 260, 261లో సదరు అధికారి అన్న కూతుర్ల పేరు పై గతేడాది కొంత భూమి కొనుగోలు చేశారు. కొను గోలు చేసిన కొద్ది సమయంలోనే బాయిల్డ్‌ రైస్‌మిల్లు ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. రిలిక్‌ అగ్రో ఫార్మ్‌ ఇండస్ర్టీస్‌ (ఓపీసీ) ప్రైవేటు లిమిటెడ్‌ పేరుతో ఇండస్ర్టీని రిజిస్టర్‌ చేసి పనులు ప్రారంభించారు. ప్ర స్తుతం అక్కడ గోదాం నిర్మాణం పూర్తయ్యింది. బా యిలర్స్‌, పొగ గొట్టం, ఇతర మిషనరీలు ఇంకా ఏర్పా టు చేయలేదు. వాటిని ఏర్పాటు చేసే షెడ్లు కూడా పూర్తి కాలేదు. ఈలోపు యాసంగిలో ఈసారి భారీగా ధాన్యం దిగుబడులు వచ్చాయి. సదరు అధికారి బాస్‌ కావడంతో, మిల్లు పునాదుల్లో ఉండగానే చక చకా ధాన్యం కేటాయింపులు చేశారు. అధికారులు కూడా ఇందుకు పూర్తిస్థాయిలో సహకరించారు. సారు మిల్లుకే కాబట్టి ఎలాంటి సమస్యలు రావని భావించారు.


నిబంధనలివే..

పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం మిల్లు నిర్మాణం పూర్తయి మిషనరీలు రన్నింగ్‌లో ఉన్న వా టిని గుర్తించి ప్రతీ ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్‌ కింద కేటాయిస్తారు. మిల్లు సా మర్థ్యం, మిల్లు రకాన్ని బట్టి కేటాయింపులు ఉంటా యి. రా రైస్‌ మిల్లుల కెసాసిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి కేటాయింపులు తక్కువ చేస్తారు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు ఎక్కువ కేటాయిస్తారు. క్షేత్రస్థాయిలో మిల్లు పనితీరును పరిశీలించి రాష్ట్ర అధికారులకు పంపిస్తే వారు ధాన్యం కేటాయింపులు చేస్తారు. జి ల్లాలో ఈ సంవత్సరం 2.99 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించారు. 1.79 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పది బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించారు. అందులో రిలిక్‌ అగ్రో ఫార్మ్‌ ఇండస్ర్టీ కేటాయించింది 20,388 మెట్రిక్‌ టన్నులు. మిగిలిన ధాన్యంలో జిల్లా లో 41 రా రైస్‌ మిల్లులకు 45,091 మెట్రిక్‌ టన్నుల కేటాయించారు. అవి కాకుండా ఇతర జిల్లాల మిల్లు లకు దాదాపు 75 వేల మెట్రిక్‌ టన్నులు పంపించా రు. నిబంధనల ప్రకారం సీఎంఆర్‌ కోసం ధాన్యం కే టాయించిన మిల్లులు 90 రోజుల్లోపు బియ్యం పౌర సరఫరాల శాఖకు అప్పగించాలి. కానీ, రిలిక్‌ అగ్రో ఫార్మ్‌ ఇండస్ర్టీ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ నే పథ్యంలో నిర్ణీత గడువులోపు ఆ ధాన్యం మర ఆడిం చడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్ర తీ ఏటా సీఎంఆర్‌ అందించడంలో మిల్లులు అలస త్వం ప్రదర్శిస్తూనే ఉన్నాయి. తరచూ మీటింగ్‌లు ని ర్వహించి సీఎంఆర్‌ త్వరితగతిన అందజేయాలని చె ప్పే జిల్లా స్థాయి అధికాకే నిర్మాణం పూర్తి కాని మి ల్లులకు ధాన్యం కేటాయింపులు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఇదే విషయమై పౌర సరఫరాల శాఖ అధికారి రే వతిని వివరణ కోరగా.. తాను ఉన్నతాధికారుల ఆ దేశాల మేరకు మాత్రమే కేటాయింపులు చేశానని, చాలా జిల్లాల్లో పని చేసినా ఈ జిల్లా పరిస్థితిని ఎ క్కడా చూడలేదని తెలిపారు. ఆ మిల్లు కేటాయింపు ల గురించి మర్చిపోమని చెప్పడం కూడా గమనా ర్హం. అలాగే మిల్లుకు ధాన్యం కేటాయింపులపై అడి షనల్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌ను వివరణ కోరగా మిల్లు నిర్మాణం పూర్తికాకపోవడం వల్లే కమిషనర్‌ నుంచి అనుమతులు పొందినట్లు తెలిపారు. అందులో ఆ రోపణలు ఏమీ లేవని, మిల్లు నిర్మాణం పూర్తికానిది వాస్తవమేనని చెప్పారు.

Updated Date - 2021-07-25T04:19:04+05:30 IST