చేపకూ ఎసరు!

ABN , First Publish Date - 2020-02-23T06:27:53+05:30 IST

ఆరు దశాబ్దాల నుంచి మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న ఐదు కోట్ల రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంది.

చేపకూ ఎసరు!

 మత్స్యశాఖ భూమి ఇళ్ల స్థలాలకు కేటాయింపు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

ఆరు దశాబ్దాల నుంచి మత్స్యశాఖ ఆధీనంలో ఉన్న ఐదు కోట్ల రూపాయల విలువైన రెండు ఎకరాల భూమిని రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకుంది. మత్స్యకారు లకు చేప పిల్లల ఉత్పత్తికేంద్రాలుగా ఉపయోగపడు తున్న ఈ భూమిని ప్రభుత్వం అమలుచేస్తున్న నవ రత్నాల్లో భాగంగా ఇళ్ల స్థలాలుగా కేటాయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే తమ జీవనోపాధికి ఉపయోగ పడుతున్న మత్స్యశాఖ ఆధీనంలోని ఉత్పత్తి కేంద్రాల నిర్వహణకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్న దృష్ట్యా ఈ భూమిని ఇళ్ల స్థలాల కోసం తీసు కోవద్దని మత్స్యకార సహకార సంఘాల నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అమలాపురం మండల పరిధిలోని 11 గ్రామ పంచాయతీల్లో 2744మంది లబ్ధిదారులకు నివేశన స్థల పట్టాలను మంజూరు చేసేందుకు వీలుగా 22.39 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. పన్నెండు లేఅవుట్లలో జీప్లస్‌3 గృహ నిర్మాణాలు నిర్మిం చనున్నారు.


దీనిలో భాగంలో ఈదర పల్లిలోని సర్వే నంబరు 2/2ఏలో సుమారు రెండెకరాల భూమి మత్స్య శాఖ ఆధీనంలో ఉంది. ఈ భూమిని స్వాధీనం చేసుకుని జీప్లస్‌3 భవనాల నిర్మా ణానికి అధికారులు సిద్ధమ య్యారు. ఆరు దశాబ్దాల కాలం నుంచి ఈ భూముల్లో డివిజన్‌లోని వివిధ ప్రాంతాల మత్స్యకారులు చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను నిర్వహించుకుంటున్నారు. ఇక్కడే మత్స్యశాఖ కార్యాలయం కూడా ఉంది. తీరప్రాంతం అత్యదికంగావున్న కోనసీమలోని మత్స్యకారులకు ప్రభుత్వం ద్వారా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ఈదరపల్లిలోనే ఉన్నాయి.


వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే చేప పిల్లలను ప్రతి ఏటా ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిలో వదలడం ద్వారా అవి పెరిగి పెద్దయ్యి తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి ఉపయోగపడు తుంది. ఓ పెద్ద చెరువు, మరో మూడు ఆర్‌సీసీ సిమెంట్‌ టబ్స్‌ ఉన్నాయి. కోనసీమ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లోని మత్స్యకార సంఘాలకు పంచాయితీల చెరువులు, డ్రైయి న్‌లు, ఇతర నీటి వనరులు ఉన్న ప్రాంతాలలో చేపల ఉత్పత్తికి ఇక్కడ నుంచే సీడ్‌ ఉత్పత్తి జరుగుతుంది.


ఈ రెండు ఎకరాల భూమిని జీప్లస్‌3 నిర్మాణాల కోసం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ప్రభు త్వం స్పందించి ఆభూమిని సేకరణ నుంచి మినహా యించాలని మత్స్యకార సంఘాలు ఇటీవల జిల్లా కలెక్టర్‌, ఇన్‌చార్జి మంత్రితోపాటు జిల్లా మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశాయి. లక్షలాది మంది జీవనోపాధి అయిన ఈ ప్రభుత్వ భూమిని ఇళ్ల స్థలాల కోసం ఉప యోగించడం సమంజసం కాదని, రానున్న రోజుల్లో జిల్లా కేంద్రమైతే మత్స్యశాఖ అభివృద్ధికి ఈ భూములు ఎంత గానో ఉపయోగపడతాయని వారు  పేర్కొంటున్నారు.

Updated Date - 2020-02-23T06:27:53+05:30 IST