ఏకలవ్య పాఠశాలల్లో సీట్ల కేటాయింపు

ABN , First Publish Date - 2021-07-30T05:13:13+05:30 IST

ఏజెన్సీలో 11 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు లాటరీ పద్ధతిలో సీట్లను కేటాయించారు.

ఏకలవ్య పాఠశాలల్లో సీట్ల కేటాయింపు
ఈఎంఆర్‌ స్కూళ్లలో సీట్లకు లాటరీ తీస్తున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ


మొత్తం 660 సీట్లు.. 2,341 దరఖాస్తులు 

పాడేరు, జూలై 29: ఏజెన్సీలో 11 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌  స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు లాటరీ పద్ధతిలో సీట్లను కేటాయించారు. ఒక్కో ఏకలవ్య పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశానికి బాలురకు 30, బాలికలకు 30 చొప్పున మొత్తం 11 ఏకలవ్య పాఠశాలల్లో 660 సీట్లకు గానూ 2,341 దరఖాస్తులు వచ్చాయి. వాటి ఆధారంగా గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో గిరిజన విద్యార్థులకు సీట్ల కేటాయింపు ప్రక్రియను ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ లాంఛనం ప్రారంభించారు. లాటరీలో వచ్చిన పేర్ల ఆధారంగా ఆయా విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం అందిస్తామని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో టీడబ్ల్యూ డీడీ జి.విజయకుమార్‌, గురుకులాల కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కిశోర్‌బాబు, ఏకలవ్య స్కూళ్లు, గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-07-30T05:13:13+05:30 IST