సింధు అకాడమీకి భూమి కేటాయింపు

ABN , First Publish Date - 2021-06-18T09:21:13+05:30 IST

బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది.

సింధు అకాడమీకి భూమి కేటాయింపు

అమరావతి (ఆంధ్రజ్యోతి): బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అకాడమీ, స్పోర్ట్స్‌ స్కూల్‌కు ఏపీ ప్రభుత్వం స్థలం కేటాయించింది.  విశాఖపట్నం జిలా,్ల విశాఖ రూరల్‌ మండలం చిన్నగదిలి గ్రామంలో రెండు ఎకరాలను అకాడమీకి కేటాయిస్తూ  గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.  అకాడమీ అవసరాల కోసమే ఆ భూమిని వినియోగించాలని, కమర్షియల్‌ అవసరాల కోసం వినియోగించకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  

Updated Date - 2021-06-18T09:21:13+05:30 IST