భళా.. స్నేహ్‌ రాణా

ABN , First Publish Date - 2021-06-20T08:24:53+05:30 IST

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో భారత్‌ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా..

భళా..  స్నేహ్‌ రాణా

డ్రాతో గట్టెక్కిన భారత్‌

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌


బ్రిస్టల్‌: ఇంగ్లండ్‌తో ఏకైక టెస్ట్‌లో భారత్‌ చిరస్మరణీయ డ్రాతో గట్టెక్కింది. ఫాలో ఆన్‌ ఆడుతూ ఓ దశలో ఓటమి దిశగా సాగిన టీమిండియాను అరంగేట్రం ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా (154 బంతుల్లో 80 నాటౌట్‌), తానియా  (88 బంతుల్లో 44 నాటౌట్‌) శతక భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దీంతో భారత్‌ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 83/1తో ఆఖరి, నాలుగో రోజు ఆటను ఆరంభించిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 344/8 పరుగులు చేసింది. మొత్తంగా భారత్‌ అదనంగా 179 పరుగుల ఆధిక్యం సాధించింది. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు 12 ఓవర్లు ముందుగానే డ్రాకు అంగీకరించారు. షఫాలీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ దక్కింది.


పోరాడిన టెయిలెండర్లు..:

షఫాలీ.. నిన్నటి స్కోరుకు మరో 8 పరుగులు జోడించి పెవిలియన్‌ చేరింది. దీప్తి శర్మ (54), పూనమ్‌ రౌత్‌ (39) ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ, లంచ్‌కు ముందు దీప్తి అవుటైంది. కెప్టెన్‌ మిథాలీ (4) మరోసారి విఫలం కాగా.. పూనమ్‌ను స్కివర్‌ పెవిలియన్‌ చేర్చింది. చివరకు స్నేహ్‌-తానియా తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 104 రన్స్‌ జోడించి భారత్‌ను గట్టెక్కించారు. 


అరంగేట్రం టెస్ట్‌లోనే హాఫ్‌ సెంచరీకిపైగా స్కోరుతోపాటు 4 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా స్నేహ్‌ రాణా. ఓవరాల్‌గా ఆమె నాలుగో ప్లేయర్‌మహిళా క్రికెట్‌ చరిత్రలో ఒక టెస్ట్‌ మ్యాచ్‌లో మూడు సిక్స్‌లు బాదిన తొలి బ్యాట్స్‌వుమన్‌గా షషాలీ వర్మ. 


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:396/9 డిక్లేర్డ్‌;

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 231 ఆలౌట్‌; 


భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 

స్మృతి (సి) స్కివర్‌ (బి) బ్రంట్‌ 8, షఫాలీ (సి) బ్రంట్‌ (బి) ఎక్లిస్టోన్‌ 63, దీప్తి శర్మ (బి) ఎక్లిస్టోన్‌ 54, పూనమ్‌ (సి) ఎక్లిస్టోన్‌ (బి) స్కివర్‌ 39, మిథాలీ (బి) ఎక్లిస్టోన్‌ 4, హర్మన్‌ప్రీత్‌ (సి) జోన్స్‌ (బి) ఎక్లిస్టోన్‌ 8, పూజా వస్త్రాకర్‌ (బి) నైట్‌ 12, స్నేహ్‌ రాణా (నాటౌట్‌) 80, శిఖా పాండే (సి) జోన్స్‌ (బి) స్కివర్‌ 18, తానియా (నాటౌట్‌) 44; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: 121 ఓవర్లలో 344/8; వికెట్ల పతనం: 1-29, 2-99, 3-171, 4-175, 5-175, 6-189, 7-199, 8-240;  బౌలింగ్‌: బ్రంట్‌ 21-5-49-1, అన్యా ష్రబ్‌సోల్‌ 13-2-52-0, ఎక్లిస్టోన్‌ 38-10-118-4, క్రాస్‌ 15-6-43-0, హీథర్‌నైట్‌ 15-2-41-1, స్కివర్‌ 16-9-21-2, ఎల్విస్‌ 3-1-8-0. 

Updated Date - 2021-06-20T08:24:53+05:30 IST