Abn logo
May 12 2020 @ 10:38AM

ప్ర‌భుత్వానికి అల్లు అర‌వింద్ అభ్య‌ర్థ‌న‌

లాక్‌డౌన్ కార‌ణంగా సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించింది. థియేట‌ర్స్ మూత‌ప‌డ‌ట‌మే కాకుండా షూటింగ్స్‌, ప్రీ, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌న్నీ ఆగిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప‌లువురు నిర్మాత‌లు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను అనుమ‌తిని ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తులు చేస్తున్నారు. ఈ క‌మ్రంలో టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ తెలంగాణ ప్ర‌భుత్వానికి ప్ర‌త్యేక అభ్య‌ర్థ‌న చేశారు. వివ‌రాల్లోకెళ్తే.. అర‌వింద్ స్టార్ట్ చేసిన ఓటీటీ ఫ్లాట్‌పామ్ ఆహా కోసం ఓ మినీ వెబ్‌సిరీస్‌ను నిర్మించాల‌నుకుంటున్నారు. అందుకోసం 15 నుండి 20 మంది స‌భ్యులున్న యూనిట్‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని, క‌రోనా ఎఫెక్ట్ లేకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటామ‌ని కోరారంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి థియేట‌ర్స్‌, సినిమా షూటింగ్స్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనుందో వేచి చూడాలి. 

Advertisement
Advertisement
Advertisement