Advertisement

గెస్ట్‌లుగా అల్లు అర్జున్, రాజమౌళి వస్తున్నారు

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'అఖండ'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవనున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు, టీజర్, సాంగ్స్‌కు విశేష స్పందన లభించింది. కాగా, ఈ చిత్రం డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నవంబర్ 27న హైద‌రాబాద్‌లోని శిల్పా కళా వేదికలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కు ఎస్ ఎస్ రాజమౌళి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. 

Advertisement