Oct 26 2021 @ 15:39PM

అల్లు అర్జున్ ‘ఐకాన్’ కి మళ్ళీ బ్రేకులు తప్పవా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది షూటింగ్. డిసెంబర్ 17న ‘పుష్ప’ మొదటిభాగానికి రిలీజ్ డేట్ లాక్ చేశారు. అయితే బన్నీ తదుపరి చిత్రం బోయపాటితో అనే వార్తలు బాగా వ్యాపిస్తుండడంతో.. ‘పుష్ప’ తర్వాత పట్టాలెక్కించాలి  అనుకున్న ‘ఐకాన్’ ప్రాజెక్ట్ కు మళ్ళీ బ్రేకులు తప్పట్లేదని ఫిల్మ్ నగర్ టాక్. మూడేళ్ళ క్రితం దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమాని  అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అప్పట్లో కథ బాగా నచ్చడంతో బన్నీ ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపించారు. అయితే అదే సమయంలో బన్నీ త్రివిక్రమ్ ‘అలవైకుంఠపురములో’, సుకుమార్ ‘పుష్ప’ సినిమాల్ని కూడా అనౌన్స్ చేశారు. 



అయితే ‘ఐకాన్’ సినిమాను పక్కన పెట్టి మిగిలిన రెండు సినిమాల్ని టేకప్ చేశారు బన్నీ. ఇటీవల పవర్ స్టార్ తో ‘వకీల్‌సాబ్’ తీసి మంచి సక్సెస్ అందుకోవడంతో ‘పుష్ప’ తర్వాత ‘ఐకాన్’ సినిమాను ట్రాక్ ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. వేణు శ్రీరామ్ పై నమ్మకం కుదరడంతోనే బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ తన నిర్ణయం మార్చుకున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ‘పుష్ప’ మూవీ తర్వాత బన్నీ..   బోయపాటి శ్రీను మూవీలో నటించే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం ఓ సీనియర్ స్టార్ హీరోతో యాక్షన్ మూవీ తెరకెక్కించారు బోయపాటి. సినిమా విడుదలకు సిద్ధమైంది. అది కానీ  సూపర్ హిట్టైతే... అల్లు అర్జున్ తదుపరి చిత్రం బోయపాటితోనే ఖాయమని టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద అల్లు అర్జున్ తదుపరి చిత్రం విషయంలో క్లారిటీ రావాలంటే.. బోయపాటి సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే.