Abn logo
May 8 2020 @ 13:29PM

బన్నీ రీ మేకోవర్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాత్రనుగుణంగా లుక్‌ను మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయ‌న హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న చిత్రం ‘పుప్ప‌’. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా కోసం బ‌న్నీ స‌రికొత్త లుక్‌లోక‌న‌ప‌డ‌బోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన బ‌న్నీ ఫ‌స్ట్ లుక్‌, టైటిల్‌కి మంచి స్పంద‌న వ‌చ్చింది. పుప్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌బోతున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే క‌రోనా ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. సినిమా షూటింగ్ ఇప్ప‌ట్లో ప్రారంభం అయ్యేలా క‌న‌ప‌డ‌టం లేదు. దీంతో బ‌న్నీ తన లుక్‌ను కాస్త మార్చుకున్నార‌ట‌. షూటింగ్ స‌మ‌యానికి మ‌ళ్లీ ‘పుష్ప’ లుక్‌లో క‌న‌ప‌డే విధంగా బ‌న్నీ లుక్ మార్చుకున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా నటిస్తోంది. 

Advertisement
Advertisement
Advertisement