రౌడీ హీరోగా గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ స్టైల్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రయోగాలు చేస్తుంటాడు. ప్యాషన్ పట్ల ఎంతో అభిరుచి కలిగిన విజయ్ స్వయంగా `రౌడీ` పేరుతో ఓ దుస్తుల బ్రాండ్‌ను కూడా నెలకొల్పాడు. ఈ `రౌడీ` బ్రాండ్‌కు విజయ్ అభిమానులు మాత్రమే కాకుండా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయ్యాడు. దీంతో బన్నీకి విజయ్ గతంలో `రౌడీ` బ్రాండ్ దుస్తులను పంపించాడు.
తాజాగా మరోసారి బన్నీ కోసం విజయ్ ప్రత్యేకంగా దుస్తులను డిజైన్ చేసి పంపించాడు. ఆ దుస్తులు తనకు చాలా నచ్చాయని పేర్కొన్న బన్నీ.. ట్విటర్ ద్వారా విజయ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. `ఇలాంటి సౌకర్యవంతమైన, అందమైన దుస్తులను పంపినందుకు నా బ్రదర్ విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు. నాపై నువ్వు చూపిన ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్. నువ్వు మరింతగా ఎదగాల`ని బన్నీ ట్వీట్ చేశాడు.