Allu arjun: నెక్స్ట్ మూవీ అప్‌డేట్ ఎప్పుడు..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయో నెక్స్ట్ మూవీ అప్‌డేట్ ఎప్పుడు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప ది రైజ్ పార్ట్ 1‘ రిలీజ్‌కు రెడీ అవుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. డిసెంబర్ 17న భారీ స్థాయిలో 5 భాషల్లో ఒకేసారి విడుదల కానున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఇంకా కన్‌ఫర్మేషన్ లేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్‘ సినిమాను చేస్తారని టాక్ వినిపిస్తొంది. అంతేకాదు.. లిస్ట్‌లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, పరశురామ్, రాధాకృష్ణ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి. మరి వీరిలో ఎవరికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తారో చూడాలి.   

Advertisement
Advertisement