యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'అల్లుడు అదుర్స్'. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెల ఈ చిత్రాన్ని నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 14న విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ "అల్లుడు అదుర్స్ సినిమాను రూ.32 కోట్ల బడ్జెట్‌తో రూపొందించాం. ఇందులో రూ.21 కోట్లు.. శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారా వచ్చాయి. మూడు రోజుల్లో పది కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సినిమా సాధించింది. సినిమా లాభాల్లోకి ఎంటరైంది" అన్నారు ప్రకాశ్ రాజ్, సోనూసూద్ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు.