Abn logo

ఆల్మండ్‌ కోఫ్తా

కావలసినవి: బంగాళదుంపలు - రెండు, జాజికాయ పొడి - చిటికెడు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - ముప్పావు కప్పు, గ్రీన్‌ ఆనియన్స్‌ - అర కప్పు, మైదా పిండి - అరకప్పు, కోడిగుడ్లు - మూడు,  ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, బ్రెడ్‌క్రంబ్స్‌ - రోలింగ్‌ కోసం.


తయారీ విధానం: ముందుగా బంగాళదుంపలు ఉడికించి, మెత్తగా చేసుకోవాలి. బాదంపలుకులను గ్రైండ్‌ చేసుకోవాలి. ఒక పాత్రలోకి వాటిని తీసుకుని తగినంత ఉప్పు, మిరియాల పొడి, జాజికాయ పొడి, పాలు, గ్రీన్‌ ఆనియన్స్‌, మైదా పిండి, రెండు కోడిగుడ్లు పగలకొట్టి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మిశ్రమాన్ని పావుగంటపాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ప్లేట్‌లో మైదా పిండి, మరొక ప్లేట్‌లో కోడిగుడ్లు పగలకొట్టి పెట్టుకోవాలి. మరొక ప్లేట్‌లో బ్రెండ్‌క్రంబ్స్‌ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టిన మిశ్రమాన్ని తీసి సమాన సైజుల్లో కోఫ్తాలు తయారుచేసుకోవాలి. ఒక్కో కోఫ్తాను ముందుగా మైదా పిండిలో తరువాత కోడిగుడ్డు సొనలో అద్దాలి. చివరగా బ్రెడ్‌క్రంబ్స్‌ అద్దాలి. ఓవెన్‌ను 200 డిగ్రీ సెంటీగ్రేడ్‌కు ప్రీ హీట్‌ చేసి కోఫ్తాలను బేక్‌ చేసుకోవాలి. పుదీనా చట్నీతో కోఫ్తాలు సర్వ్‌ చేసుకోవాలి.



వేరుశనగల చాట్‌దోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌మసాలా తమలపాకుల వడలుఆలూ మసాలా పూరిబేక్డ్‌ అరటికాయ సమోసఈస్ట్‌ వెస్ట్‌ స్ర్పింగ్‌ రోల్స్‌రాజ్మా పకోడివెజ్‌ బర్గర్‌పచ్చిబఠాణీ చీలా
Advertisement