జీడిపప్పా..? బాదం పప్పా..? ఏది మంచిది..?

ABN , First Publish Date - 2020-02-09T18:24:44+05:30 IST

జీడిపప్పు, బాదంపప్పులలో ఏది మంచిది? రోజుకు ఎన్ని తినవచ్చు?

జీడిపప్పా..? బాదం పప్పా..? ఏది మంచిది..?

ఆంధ్రజ్యోతి (9-02-2020)

ప్రశ్న: జీడిపప్పు, బాదంపప్పులలో ఏది మంచిది? రోజుకు ఎన్ని తినవచ్చు?

- రమణ, తెనాలి

జవాబు: బాదం, జీడీపప్పు, ఆక్రోట్‌, పిస్తా మొదలైన పప్పులన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిని ఏదో ఓ రూపంలో ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి. ట్రైగ్లిసరైడ్స్‌ను తగ్గిస్తాయి. ఇంకా రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడి, వాపును తగ్గిస్తాయి. వీటన్నిటి వల్లా గుండెకు రక్షణ లభిస్తుంది. బాదం, జీడి పప్పు... రెంటిలోనూ కెలోరీలు ఒకే రకంగా ఉన్నప్పటికీ జీడిపప్పులో సాచ్యురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్లు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ. బాదంలో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థాలు కూడా అధికం. బాదంలో కాల్షియం ఎక్కువగా ఉంటే, జీడిపప్పులో ఐరన్‌ పుష్కలం. రెండు రకాల పప్పుల్లోనూ పోషక పదార్థాలు ఉంటాయి. కాబట్టి ఒకటి మంచిది వేరొకటి కాదు అని ఆలోచించకుండా రెంటినీ సమానంగా తీసుకుంటే అన్ని పోషకాలూ లభిస్తాయి. అయితే డయాబెటిస్‌ ఉన్నవారికి జీడిపప్పు కంటే బాదం వల్లే ఎక్కువ ప్రయోజనం. రెండు పప్పులూ కూడా అధిక కెలోరీలను కలిగి ఉన్నాయి కాబట్టి, రోజుకు అన్నీ కలిపి గుప్పెడు లేదా ముప్పయి గ్రాముల లోపే తీసుకోవడం ఉత్తమం. 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-02-09T18:24:44+05:30 IST