Abn logo
Jul 13 2020 @ 23:50PM

ఒంటరిగా.. ప్రేమతో!

విక్కీ, కియారెడ్డి, సోనాలి వర్దమ్‌, లోహిత నటీనటులుగా రూపుదిద్దుకొన్న ‘మిస్టర్‌ లోన్లీ’ చిత్రం పోస్టర్‌ను విశాఖ ఎంపీ, నిర్మాత ఎం.వి.వి. సత్యనారాయణ ఆవిష్కరించారు. చిత్రకథాంశం ఆసక్తికరంగా ఉందనీ, సినిమా విజయం సాధించాలని సత్యనారాయణ ఆకాంక్షించారు. చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ ‘కాలేజ్‌ నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా ఆకట్టుకొంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆనంద్‌ గారా, దర్శకత్వం: ముక్కి హరీశ్‌.


Advertisement
Advertisement
Advertisement