‘అలుగు’ స్మగ్లింగ్‌ ముఠా పట్టివేత

ABN , First Publish Date - 2020-08-04T10:12:27+05:30 IST

భద్రాచలం అటవీ ప్రాంతంలో లభించే అలుగు జంతు చర్మాలను సేకరించి మార్కెటింగ్‌ చేస్తున్న 12మంది సభ్యుల అంతరాష్ట్ర ముఠాను భద్రాద్రి

‘అలుగు’ స్మగ్లింగ్‌ ముఠా పట్టివేత

12మంది అరెస్టు, నాలుగు కేజీల పొలుసు స్వాధీనం


భద్రాచలం, ఆగస్టు 3: భద్రాచలం అటవీ ప్రాంతంలో లభించే అలుగు జంతు చర్మాలను సేకరించి మార్కెటింగ్‌ చేస్తున్న 12మంది సభ్యుల అంతరాష్ట్ర ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్‌ నాయక్‌ ఆధ్వర్యంలోని అటవీశాఖ బృందం సోమవారం పట్టుకుంది. వీరి నుంచి నాలుగు కేజీల అలుగు పొలుసులను స్వాధీనం చేసుకున్నారు.


వారం రోజుల పాటు అటవీశాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో వీరి కోసం గాలించారు. హైదరాబాద్‌, కొత్త్తగూడెం, భద్రాచలం, ఒడిశా, ఏపీ అటవీశాఖ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఏజెన్సీలోని భద్రాచలం అటవీ ప్రాంతంలో గిరిజనులకు కొద్ది మొత్తం ఆశ చూపి ఈ ముఠా చర్మాలను సేకరిస్తోంది. కొత్తగూడేనికి చెందిన బాదావత్‌ రవి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించిన అటవీశాఖ అధికారులు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో నిఘా పెట్టి సునీల్‌, నాగరాజులతో పాటు మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని వన్యప్రాణి చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. ఈ ముఠాకు చెందిన మరో ముగ్గురు పరారీలో ఉన్నారని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-04T10:12:27+05:30 IST