వేదవతి కాలువ వెడల్పుపై విచారణ

ABN , First Publish Date - 2021-06-12T05:22:22+05:30 IST

ఆలూరు నియోజకవర్గ పరిధిలో శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారానికి నిర్మిస్తున్న వేదవతి ప్రాజెక్టు కాలువ నిర్మాణ వెడుల్పు తగ్గింపుపై రైతులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు ప్రభుత్వానికి ఇచ్చిన వినతుల మేరకు ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి గురువారం విచారించారు.

వేదవతి కాలువ వెడల్పుపై విచారణ

ఆలూరు, జూన్‌ 11: ఆలూరు నియోజకవర్గ పరిధిలో శాశ్వత సాగు, తాగునీటి పరిష్కారానికి నిర్మిస్తున్న వేదవతి ప్రాజెక్టు కాలువ నిర్మాణ వెడుల్పు తగ్గింపుపై రైతులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులు ప్రభుత్వానికి ఇచ్చిన వినతుల మేరకు ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి గురువారం విచారించారు. దీంతో శుక్రవారం ఆలూరు రెవెన్యూ అధికారులు మెగా కంపెనీ ప్రతినిధులు కలిసి రైతుల వినతుల మేరకు 90 అడుగుల నుంచి 30 అడుగులకు తగ్గించేందుకు నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నట్లు తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-12T05:22:22+05:30 IST