ఎల్లవేళలా పేదలకు అండగా ఉంటా

ABN , First Publish Date - 2020-06-30T10:46:28+05:30 IST

తాను అనునిత్యం పేదప్రజలకు అండగా ఉంటానని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ పేర్కొన్నారు.

ఎల్లవేళలా పేదలకు అండగా ఉంటా

వైరా, జూన్‌ 29: తాను అనునిత్యం పేదప్రజలకు అండగా ఉంటానని వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ పేర్కొన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో 13మందికి సీఎం సహాయనిధి నుంచి రూ.1,83,500చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయంలో కూడా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్‌ యధావిధిగా అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ జైపాల్‌, జడ్పీటీసీ  కనకదుర్గ, రెబ్బవరం సర్పంచ్‌ సాదం రామారావు, కౌన్సిలర్లు చల్లగుండ్ల నాగేశ్వరరావు, ధనేకుల వేణు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు ధార్న రాజశేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-30T10:46:28+05:30 IST